అరిషడ్వర్గాలు (వర్గాలు) అనరాదు. అరిషడ్వర్గం (వర్గం) అనవలె. అరి + షట్ + వర్గం.ఆరింటి సమూహం....

అరిషడ్వర్గాలు (వర్గాలు) అనరాదు. అరిషడ్వర్గం (వర్గం) అనవలె. 

అరి + షట్ + వర్గం.
ఆరింటి సమూహం .
కామ,క్రోధ,లోభ,మోహ,మద, మాత్సర్యము.


వర్గం అంటేనే సమూహం అని గదా !

ఏదో కావాలి అని కోరే కోరిక. అదే - *కామం* 

అది తీరక పోతే కలిగే దే కోపం. అదే - *క్రోధం* 

అది నాకే తీరాలి,నాకే దక్కాలి దక్కినది నావద్దే ఉండాలి అనుకోవడం - *లోభం* 

అది తీరకపోతే సచ్చిపోతాననడం - 
దాని పై విపరితమైన పిచ్చి *మోహం* 

అది నాకు తీరింది, నా దగ్గర ఉంది ఇంకెరి వద్ద లేదు భావించుట గర్వించడం - *మదం* 

అది నాకు తీరకుండా, ఇంకొకడికి తీరింది అనుకోవడం - *మాత్సర్యము*

ఈ ఆరు మానవునిలో నివాసం ఏర్పచుకొన్న గుణాలు. వీటిని ఎవరైతే అణచి వేస్తూ, వాటిని జయించుతాడో వాడే జితేంద్రియుడు.

Post a Comment

0 Comments