''రాజు మరణించే.. నొక తార రాలిపోయే ...._ _కవియు మరణించే.. నొక తార గగన మెక్కె ...._ _రాజు జీవించె రాతి విగ్రహములందు ..._ _సుకవి జీవించె ప్రజల నాలుకల యందు''

_''రాజు మరణించే.. నొక తార రాలిపోయే ...._
_కవియు మరణించే.. నొక తార గగన మెక్కె ...._
_రాజు జీవించె రాతి విగ్రహములందు ..._
_సుకవి జీవించె ప్రజల నాలుకల యందు''_
  అని ఫిిరదౌసి కావ్యంలో  కవి గురించి అధ్బుతంగా వ్రాసిన కవి జాషువ.    జులై 24 ఆయన వర్థంతి.



                   దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం జాషువా గబ్బిలం రాశారు.

              ''నాదు కన్నిటి కథ సమన్వయము సేయనార్థ్ర హృదయంబు గూడ కొంతవసరంబు'' అని గబ్బిలం గురించి జాషువా వాపోయాడు.
 ఉత్తమ జాతి పక్షులుగా పిలువబడే హంసలు, చిలుకలను పక్కకు తీసి సమాజంలోకి అతి వేగంగా దూసుకుపోయేలా 'గబ్బిలం' కవి కళ్లకు దళితంగానే కనిపించింది. 

జాషువా రచనలు అగ్రరాజ్యాధికారం తుదముట్టించే దిశలో కొనసాగాయి. దళితులకు తిండి బట్టలతో పాటు స్వేచ్ఛ జీవనం కూడా దుర్భేద్యంగా ఉండేది ఆనాటి కాలంలో.
''కఠిన చిత్తుల దురాగములు ఖండించి 
కనికార మొలకించు కులమునాది'' అందుకే 
''నిమ్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయునని'' అని హెచ్చరించాడు. 
గర్జించాడు. 
శాసించాడు. 

              చతుర్వర్ణ వ్యవస్థను నిలదీస్తూ జాషువా విప్లవ మూర్తిగా సాక్షాత్కరించాడు. పంచమ కులం ఎక్కడుందని ఆవేదనకు గురయ్యాడు. ''ముసలి వాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాను గాని
వసరమునకన్న హీనుడు భాగ్యుడు.. యైదవ కులస్థు డెవరమ్మా, సవిత్రి.?'' అంటూ తన పద్యాలను తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యానికి మార్గదర్శకంగా రాశారు.

            కులం ద్వారా కలిగిన అవమానం, దారిద్య్రంతో జాషువా హృదయం ద్రవించింది.

''విశ్వనరుడను నేను నాగు తిరుగులేదు'' అని తన వీర కవిత్వాన్ని యావత్‌ ప్రపంచానికి ఒక చక్కని అక్షర పూలమాలలుగా అందించారు.  

అంతే కాక కవి కోకిల, 
కవి విశారద, 
కవి దిగ్గజ, 
నవయుగ కవిచక్రవర్తి, 
మధుర శ్రీనాథ, 
విశ్వకవి సామ్రాట్‌ బిరుదులు అందుకొన్నారు.

''మత పిచ్చిగాని, వర్ణో
న్నతిగాని, స్వార్థ చింతనము గానీ నాకృతులందుండదు''అని జాషువా స్పష్ట పరిచారు. 

             జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణలు కనిపిస్తాయి. నిజానికి జాషువా జీవితం నుండి అతని కవిత్వం వికసించింది. తన రచన ద్వారా అణగారిపోతున్న పేద సమాజాన్ని మార్చాలి అనుకున్నారు. ఆ కోవలోనే ప్రయత్నించారు. జాషువాలో, అతని రచనలలో కసి గానీ, ద్వేషం గానీ లేదు. కేవలం ప్రతిఘటన మాత్రమే. 

            ముఖ్యంగా ''ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో గఱిగిపోయే'' పద్యం తీవ్రమైన అనుభూతిని కలిగిస్తుంది. అందరూ సమానమనే తత్వాన్ని భోదించారు జాషువా. వారి ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే..

            జాషువ కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారు. ప్రజల్లో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించారు. సమాజంలో చెరగని ముద్ర జాషువా. 
          వారి ఆశలు ఆకాంక్షలు, లక్ష్యాలు నేరవేర్చడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి....
🙏🙏🙏💐💐🙏🙏🙏

Post a Comment

0 Comments