"ముసలం పుట్టింది" జాతీయం అర్ధం ఏమిటి?

"ముసలం పుట్టింది " (జాతీయం)
కురుక్షేత్ర యుద్ధం తరువాత యాదవులలో గర్వం
పెరిగి పోయింది.ఒకసారి విశ్వామిత్రుడు మొదలైన ఋషులంతా శ్రీకృష్ణుని దర్శించ
డానికి వచ్చారు.అప్పుడు జాంబవతి కుమారుడైన సాంబుడు అనేవాడికి స్త్రీ వేషం
వేసి,అందులోనూ గర్భవతిగా 
వేషం వేశారు.యాదవులంతా
ఆ మునులను వేళాకోళంతో
ఈమెగర్భాన పుట్టేది మగశిశువా,లేక ఆడశిశువా అని
అడిగారు.అప్పుడు ఋషులకు
వారు ఆడే నాటకం అర్థమైంది.ఈమె కడుపున
యాదవ వంశాన్ని నాశనం చేసే
ముసలం(ఇనుప రోకలి)పుడుతుందని శాపమిచ్చారు.అప్పుడు వెంటనే అతని గర్భం నుండి పెద్ద
ఇనుపరోకలి పుట్టింది.వారంతా
శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళారు.జరిగింది చెప్పారు.ఆ రోకలిని అరగదీసి 
సముద్రంలో కలపమన్నాడు.
చివరకు ఒక చిన్న ముక్కమిగిలింది.దానిని ఆ సముద్రంలో పడేశారు.దానిని
ఒకచేప మింగింది.ఆ చేప ఒక జడుడు అనే
బోయవాడి వలలో పడింది.
దానిని తన బాణానికి
ములుకుగా వాడుకున్నాడు.ఆ బాణంతోనే శ్రీకృష్ణుని చెట్టు చాటు
నుండి చంపాడు.ఆ ఇనుపరోకలి రజనంతా సముద్రం ఒడ్డుకు వచ్చి
ఒకరకమైన గడ్డి మొలిచింది
ఆ గడ్డితోనే ఒకరినొకరు కొట్టుకుని
యాదవులంతా మరణించారు.
ద్రోణంరాజు శ్రీనివాసరావు

Post a Comment

0 Comments