పాకములు

*పాకములు*


 
పాకములు మూడు విధాలుగా చెబుతారు.ద్రాక్షాపాకం,కదళీపాకం, నారికేళ పాకం అని.
పద్యం చదవగానే సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటే అది ద్రాక్షాపాకం.ద్రాక్షపండును నోట్లో వేసుకుని చప్పరించిన వెంటనే దాని రుచి తెలిసిన విధంగా పద్యం చదవగానే భావం అర్థమవుతుంది.
వేమన పద్యాలు ఇందుకు ఉదాహరణ.
రెండవది కదళీ పాకం.కదళీఫలం అంటే అరటిపండు.
అరటిపండు రుచి ద్రాక్షపండులా వెంటనె తెలియదు.అది మాగిన తరువాత చర్మం తీసి, కొద్దికొద్దిగా నమిలి మ్రింగాలి.అప్పుడే దాని మాధుర్యం తెలుస్తుంది.
అలాగే కొన్ని పద్యాలు కొంత కఠినంగా,కొంత సులభంగా ఉంటాయి.నిదానంగా అర్థం చేసుకోవాలి.
భాస్కర శతకం, దాశరథీ శతకం లోని పద్యాలు ఇంచుమించుగా కదళీపాకంలో ఉంటాయి.
ఇక మూడవది నారికేళ పాకం.నారికేళం అంటే కొబ్బరికాయ.కొబ్బరికి పీచు తీయాలి.కాయను పగల కొట్టాలి.కొబ్బరి బయటకు తీయాలి.బాగా నమిలి తినాలి.అప్పటికీ రుచిగా లేకపోతే తేనె, బెల్లం, పంచదార వంటి తీపి పదార్థాలతో కలిపి తీసుకోవాలి.అప్పటికిగాని దాని రుచి తెలియదు.
అలాగే కొన్ని పద్యాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం.నిఘంటువు సహాయం అవసరమవుతుంది.
శ్రీనాథ కవి శృంగార నైషధ కావ్యం లోని పద్యాలు ఇందుకు ఉదాహరణ.

పి.గంగాప్రసాద్. నెల్లూరు

Post a Comment

0 Comments