పక్షి గురువు.... పద విచారణ

*పక్షి గురువు*
పద విచారణ.




మ‌‌. కలదే యిమ్మెయి పౌరుషంబు.....; పక్షి గురువై సంధించె సద్బోధమున్.

భావం:- ......త్యాగానికి ,ధర్మ బుద్ధికి ఈ పక్షే నాకు గురువు అన్నాడు వేటగాడు.
ఇక్కడ సమాస పద బంధం లేదు.
పక్షి నాకు గురువు అయి నాకు బోధించింది.
అయి అగు థాతువు యొక్క భూతార్థక సమాపక రూపకం.
అంటే క్త్వార్థకం.
ఈ అయి/ అగు స్వయంగా లేదా తనంతట తానే అనే అర్థంలో ఉంటుంది.
ఏతవాతా ఇక్కడ సమాస పదబంధం కాదు.
వేటగానికి పక్షి గురువు అయి బోధించింది.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments