*ఆరో తరగతి - తెలుగు :* *డూడూ బసవన్న* *ముగుదాడు (ముక్కుతాడు)* *జాతీయం :*

*ఆరో తరగతి - తెలుగు :*
 *డూడూ బసవన్న* 
 *ముగుదాడు (ముక్కుతాడు)* *జాతీయం :* 
-----------------------------------------


 *ముక్కు తాడువేయు:* _పొగరుమోతు పశువుకు ముక్కుదూలం గుండా బస్తాలు_ _కుట్టే పెద్ద సూది (దబ్బనం)తో రంధ్రం పొడిచి, దానిగుండా సన్నని_ _త్రాడు దూర్చి ఆ తాడును పశువు ముట్టెకో మెడకో ఉండే పలుపుతో_ _కలుపుతారు. ఆ పలుపును కొంచెం లాగినా సున్నితమైన ముక్కు_ _లోపలి భాగం నొప్పిపుట్టి పశువు పిచ్చి వేషాలు వెయ్యకుండా_ _మాట వింటుంది. ఈ సామ్యంతో పై అర్థంలో దీన్ని_ _వాడుతున్నారు. అదుపుచేయు, నియంత్రించు అనే అర్థంలో ఈ_ _జాతీయాన్ని వాడుతున్నారు_
-----------------------------------------
 *కృష్ణారావు దుమ్ము*

Post a Comment

0 Comments