(వి+ ఉత్పత్తి+అర్థం=వ్యుత్పత్త్యర్థం) శబ్ద జన్య ప్రకారం ఏర్పడిన పదాలను వ్యుత్పత్తులంటారు. అది పదం యొక్క విశిష్ట ఉత్పత్తిని లేదా పదమూలాన్ని తెలుపుతుంది. దీనినే పదవ్యుత్పత్తి అంటారు. దీనిని ఆంగ్లంలో ఎటిమాలాజికల్ (Etymological ) అని పిలుస్తారు.
దీని ద్వారా పదాల పూర్వ పూర్వ రూపాలను నిరూపించడానికి ఉపకరిస్తుంది.
ఉదా: దాశరథి - దశరథుని కుమారుడు దాశరథి( శ్రీ రాముడు)
జానకి - జనకమహారాజు కుమార్తె జానకి(సీతా)
వ్యూహం- విశిష్టమైన ఊహా రచన( ప్రణాళిక)
మరణం - దీనివలన చనిపోతారు( చావు)
విజేత - విజయం పొందిన వాడు( విజయుడు)
పౌరుషం - పురుషుని భావం ( ఉద్యమం)
ద్రోణస్య అపత్యం పుమాన్ ద్రౌణిః.
ద్రోణునికొడుకు ద్రౌణి (అశ్వత్థామ).
ద్రోణస్య గోత్రాపత్యం ద్రోణః.(ద్రోణుడు) ఇది సంతానార్థంలో.
ద్రోణునిగోత్రాపత్యము (మనుమనినుండి ఆతరువాతివారు) ద్రోణుఁడు. ఇది గోత్రార్థంలో.
రఘూణా మన్వయం వక్ష్యే అని కాళిదాసుఁడు.
ఇలాగే యదువుయొక్క వంశములోనివారు యదువులే! ఇక్ష్వాకువుయొక్క గోత్రికులు ఇక్ష్వాకులే!
ఇది వంశార్థంలో.
ఇలాగే
కౌశికుడు - కుశికస్య గోత్రాపత్యమ్ - కౌశికుడు.
కుశిక వంశే భవః - కుశికుని వంశంలో పుట్టిన వారు ( విశ్వామిత్రాదులు)
ఇదేవిధంగా
కౌశికుడు - కుశికుని వంశంలో పుట్టిన వారు ( ఒక ముని)
అను విధంగా ప్రత్యక్ష దైవాలు పాఠంలోని కౌశికుడు అనే పదానికి వ్యుత్పత్తి చెప్పుకోవాలి.
ఈవిషయాలు విపులంగా సూత్రాలతో వైయాకరణసిద్ధాంతకౌముదిలో ఉన్నాయి.
పరిశీలించండి.

0 Comments