అంటే దుశ్శాసనుని శాలువ కాదు, చెడి పోయిన శాలువా కాదు. రెండు (ద్వి) శాలువాలు కలిపిన లేదా రెండు వరుసలు ఉండి మందంగా ఉన్న శాలువ.
ద్వి- అన్న సంస్కృత ఉపసర్గ (prefix) పలు ప్రాకృతాలలో దో- గాను, దు-గాను పరిణామం చెందింది. దుబాసీ అంటే రెండు భాషలు తెలిసిన ద్విభాషి. దుపట్టా అంటే కూడా రెండు వరసలు ఉండి దట్టంగా ఉన్న బట్ట. దుబారా- అంటే రెండు మారులు (దో బార్), అంటే వ్యర్థము, వ్యర్థంగా రెట్టింపు ఖర్చు.
ఈ పదాల్లాగే, రెండు శాలువాల మందం ఉండే శాలువాను దుశ్శాలువా అంటారు. సన్మానంలో ఒకశాలువ కప్పడం సరే..మహా గౌరవాన్ని ప్రకటించాలనుకుంటే రెండు శాలువలు కప్పే సంప్రదాయం ఉత్తరాది ఆచారం.
✍️ పైడి నాగ సుబ్బయ్య.

0 Comments