వ్యుత్పత్తి దేనిని అంటారు?

వ్యుత్పత్తి దేనిని అంటారు?


మామూలుగా వ్యుత్పత్తి ఒక పదానికే ఉంటుంది. దానిలోని ధాతువు, ప్రత్యయాల విభజన కారంగా పదం యొక్క అర్థాన్ని కర్తరి లోనో, కర్మణి లోనో, భావే లోనో, ఏదో ఒక కాలానికి సంబంధించి వివరిస్తారు.

పతివ్రత, రామపత్ని లాంటి పదాలకు, జానకి లాంటి పదాలకు వృత్తి ఉంటుంది. రెండు పదాల కలయిక వల్ల క్రొత్త అర్థం వస్తే దానిని వృత్తి అంటారు.


సమాసాలకు చెప్పే విగ్రహ వాక్యాన్ని (వ్యుత్పత్తి అనండి మరేదైనా అనండి) సమాస వృత్తి అంటారు.

తద్ధితాంతాలకు చెప్పే అర్థాన్ని తద్ధిత వృత్తి అంటారు.

కృతి, కరణము మొదలైన కృదంతాంతాలకు చెప్పే వృత్తిని కృద్వృత్తి అంటారు.

ఇలాగే పితరౌ (మాతా, పిత) వంటి పదాలకు చెప్పే వృత్తిని ఏకశేషవృత్తి అంటారు.

చికీర్షుః (చెయ్యాలనే కోరిక ఉన్నవాడు) లాంటి పదాలకు చెప్పే అర్థాన్ని సనాద్యంతవృత్తి అంటారు.

కనుక ఒక పదానికి అర్థం చెబితే వ్యుత్పత్తి అంటారు.

రెండు పదాల కలయిక గల క్రొత్త పదానికి లేదా కృదంతం లేదా తద్ధితాంతం లాంటి వాటికీ అర్థం చెబితే వృత్తి అంటారు.

Post a Comment

0 Comments