గంగ వెర్రులు జాతీయం వివరణ 9వ తరగతి తెలుగు

_*గంగ వెర్రులు (జాతీయం):*_ _(తొమ్మిదో తరగతి - తెలుగు) మాట మహిమ పాఠం - సారాంశం - 8, పేజీ_ - 94.
--------------------------------------
_"ఫలానా వాడు గంగ వెర్రులెత్తాడు" అంటూ ఉంటారు._
_గంగ అనే పదానికి ఒక జీవ నది అని అర్థం ఉంది. కొన్ని చోట్ల గంగ అనే పదానికి నీరు అనే అర్థం కూడా ఉంది._
_"నేను పచ్చి గంగను ముట్టలేదు" అనే వాక్యంలో గంగ = నీరు. నేను నీరు కూడా ముట్టుకోలేదు అని చెప్పడం._ _గంగ అనే పదానికి ఉన్న సహజ అర్థం నది... కొన్ని చోట్ల నీరుగా, ఆ నీరు కాస్త మద్యం (సారా) గా అర్థవిపరిణామం చెందింది. భాషలో ఒక పదానికి ఉన్న అర్థం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది._
_ఉదాహరణకు_ : (సంకుచితార్థంలో)
1. _శఠగోపం పెట్టాడు - మోసం చేశాడు._
2. _తీర్థం పుచ్చుకున్నాడు - మందు తాగాడు, ఆ వర్గంలో చేరాడు._
3. _అక్షింతలు పడ్డాయి - తిట్లు తిన్నాడు_
ఇలా అన్నమాట.
_గంగా అనే పదానికి కూడా నీరు, మద్యము అనే సంకుచిత అర్థంలో (అర్ధాపకర్షలో) వాడుతున్నారు._ _ఒకప్పటి గౌరవార్థమునకు భిన్నంగా నీచార్థములో కొన్ని సందర్భాలలో ప్రయోగిస్తున్నారు. ఈ ప్రత్యేక_ _సందర్భంలో గంగ అంటే మద్యం. ఈ గంగ (సారా) తాగినవాడికి పుట్టిన పిచ్చి గంగ వెర్రి. గంగా నదికి, వెర్రి కి ఎలాంటి_ _సంబంధమూ లేదు. పూటుగా మద్యం తాగినవాడు విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని 'గంగ_ _వెర్రులెత్తు' అంటారు. ఒక విధమైన పిచ్చి పట్టినట్లు ప్రవర్తించటం అనే_ _సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు._
----------------------------------------
_*కృష్ణారావు దుమ్ము (9014765144)*_

Post a Comment

0 Comments