*ద్రుతము*

*ద్రుతము*
న కారం ద్రుతం అంటారు. ఈ న కారం ఒల్లని ఎడల మఱిగి పోవును.
శబ్దాంతమందలి ని - ను- న్ లలో ఏదైన ద్రుతం అవుతుంది.
ఈ ద్రుతానికి సరళాలు ,స్థిరాలు గాని పరమైనచో ద్రుతం లోపిస్తుంది.
ద్రుతం లోపించిన అర్థం చెడదు.

జనించెన్ గరుడ కేతనుడు దేవకియందున్.

జనించె గరుడ కేతనుడు దేవకియందు.

ఈ ద్రుతం 3 విధాలు.
1 ప్రత్యయాత్మకం - తాను, నేను, వనమును,చదువుచున్నాను.
2. ఆగమాత్మకం- నన్ను ను, నా చేతను,
3. సముచ్చయార్థం- అన్నయును, తమ్ముడును.
ద్రుతం కలిగిన పదాన్ని ద్రుత ప్రకృతికం అంటారు.
శబ్దాల పుట్టుకను బట్టి కాకుండా వాని అంత వర్ణాలను బట్టి తెనుగు పదాలను ద్రుతప్రకృతులు,కళలు రెండు విధాలుగా విభజించారు. నిత్యం ద్రుతాంతాలుగా ఉండే శబ్దాలు ద్రుతప్రకృతులు.

మిగతా సమాచారం కోసం బాలవ్యాకరణం చూడండి.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments