*అస్తమానం - వాడుక మాటలు*

🔰⚜️🔰⚜️🔰⚜️🔰⚜️🔰⚜️🔰
*అస్తమానం: వాడుక మాటలు*
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
గోదావరి మండలంలో మంచి వ్యాప్తిలో అవ్యయశబ్దంగా వాడుకలో ఉన్నపదాల్లో అస్తమానమనేది ఉంది. 'ఎల్లప్పుడూ, రాత్రింబవళ్ళు, ఎప్పుడు పట్టినా/చూసినా' వంటి అర్థాల్లో 'అస్తమానం' అనేమాట వినిపిస్తుంది. అస్తమాన శబ్దం అస్తమయమనే సంస్కృత శబ్దానికి రూపాంతరమనీ, దానికి సాయం సంధ్య అని అర్థమనీ బ్రౌణ్య నిఘంటువు చెప్తుంది. సూర్యాస్తమయ సమయందాకా, అనే భావంతో మొదలు పెట్టి, 'ఎడతెగకుండా, నిరంతరం, నిరంతరాయంగా' అనే విస్తృతార్థం కల్పించుకొని ఈ మాట వాడుకలో నిలిచిందని చెప్పవచ్చు. ఈ మాటకు "అస్తమన" మనే రూపాంతరముందని, 'ఎల్లప్పుడు' అనే 'అప్రసిద్ధ ప్రయోగముందని ఆంధ్ర వాచస్పత్యం గుర్తించింది. కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో ఈ మాటను విస్తరించి "పొద్దస్తమానం" అనే పదబంధాన్ని ఎల్లప్పుడనే అర్థంలోనే వాడుతుంటారు. పొద్దుకు పూర్వరూపం ప్రొద్దు. దానికి 'పగలు, సూర్యుడు' అనే రెండర్థాలూ ఉన్నాయి..
🔰⚜️🔰⚜️🔰⚜️🔰⚜️🔰⚜️🔰

Post a Comment

0 Comments