29-05-2024
"అనవసర ప్రయాస" అని అర్థంలో దీన్ని వాడుతూ ఉంటారు.నదుల మధ్యలో ఏర్పడే సారవంతమైన భూభాగాన్ని లంక అంటారు. పాడి పశువులకు అవసరమైన గడ్డి అక్కడ బాగా దొరుకుతుంది. అయితే లంకకు చేరుకోవాలంటే పశువులు ఈదక తప్పదు. కడుపునిండా మేతమేసిన తరువాత మళ్ళీ ఈదుకుంటూ ఇంటికి చేరాల్సిందే. ఇలా తిన్న తిండి మొత్తం ఈదడంలోనే హరించుకుపోతుంది. ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు "లంక మేత..గోదారి ఈత" అంటుంటారు.
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
0 Comments