ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఫల్గుణ, అర్జున అని అంటూంటారు పెద్దలు..ఇలా ఎందుకు అంటారో తెలియజేయాలని గురువులకు నా మనవి

ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఫల్గుణ, అర్జున అని అంటూంటారు పెద్దలు..ఇలా ఎందుకు అంటారో తెలియజేయాలని గురువులకు నా మనవి

పాండవులు ఏకచక్రపురంలో కౌరవులు గుర్తించకుండా ఉండడానికి బ్రాహ్మణుల వేషంలో ఉండి ప్రతిరోజు భిక్షకు వెళ్లేవారు. ఒకరోజు అర్జనుడు అలానే భిక్షకు వెళ్లి వస్తూవుండగా మెరుపులు ఉరుములతో వర్షము కురిసింది. ఆసమయంలో అర్జనుని జోలెలో పిడుగు పడింది. శక్తి మంతుడు కాబట్టి ఆ పిడుగును భూమిలోకి పోనివ్వకుండా ఆపి వేసి నాడు. అపుడు పిడుగు నన్ను పోనివ్వు అని పలుకగా అందుకు అర్జనుడు అంగీకరించక ప్రత్యామ్నాయము చెబితేనే ఒదులుతాననీ చెప్పిన సందర్భంలో నీకున్న పదిపేర్లు ఎవరు పల్కుతారో వారిని బాధించనని మాటఇచ్చిన కారణంగా అర్జనుని పేర్లు స్మరించడం అలవాటు అయినది.
భిక్షకు వచ్చిన వ్యక్తి ఏదో ఒకమాట మాటచెప్పి యాచనకు వస్తారుకదా. ఒకడికి ఎలా యాచించాలో తెలీక ఆపేర్లతోనే యాచించినందున పిడుక్కూ బియ్యానికి ఒకేమంత్రమేనా అనే నానుడి కూడా ఏర్పడింది అంటారు. 
అర్జునః ఫల్గునః పార్ధ: కిరీటి:శ్వేతవాహనః 
బీభత్ సః విజయః సవ్యసాచీ ధనంజయ:
అవి అర్జునుని పేర్లు. - -ఇసుకపల్లి వేంకటేశ్వర్లు

Post a Comment

0 Comments