అగ్గి పుల్ల - సమాసం

అగ్గి పుల్ల
సమాసం

అగ్గిపుల్ల ౼ అగ్గి పుట్టించెడి పుల్ల

ఇది కర్మధారయ సమాసంలోని
లుప్త మధ్యమ పద కర్మధారయ సమాసం.

అగ్గి పుట్టీంచెడి పుల్ల
విగ్రహ వాక్యంలోని
పుట్టించెడి పదం లోపిం చగా
అగ్గి పుల్ల
అయినది.
ఉదాహరణ: దినవెచ్చము


కర్మధారయ సమాసంలో
వి పూ క స మొదలు కొని
సంభావన వరకు
మాత్రం మనకు పరిచితమే
కాని
ఇంకా రెండు ఉన్నవి.
వాటిలో
పైన చెప్పినది కాక

భిన్నపూర్వఫద కర్మధారయ సమాసం కూడ కలదు.


నాగ సుబ్బయ్య పైడి:

దినము చేసెడి (చేయు)వెచ్చము.【శ్రీనాథుని చాటువులు】
దినబత్తెము-దినము ఇచ్చు బత్తెము(హరిశ్చంద్రోపాఖ్యానం)
పరాకమ్మ- పరాక ప్రియముగా కల్గిన అమ్మ(శృ.నై.-7-30)
భక్తయ్య- భక్తి ప్రియముగా కల్గిన అయ్య(బసవపురాణం)

మధ్యమ పద లోపి సమాసంబులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబు.
(ము.ల.కౌ.- స.ప.)

(పైడి నాగ సుబ్బయ్య)

Post a Comment

0 Comments