లక్ష్మణ రేఖ - వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు.

-----
లక్ష్మణ రేఖ
______



వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ లేదు.

బంగారు లేడి కోసం రాముడు వెళ్లాక రాముడి కోసం లక్ష్మణుడూ వెళతాడు. లక్ష్మణుడు వెళ్లాక రావణుడు వచ్చి సీతను ఎత్తుకుపోతాడు.

లక్ష్మణుడు వెళ్లేముందు ఒక రేఖ గీశాడనీ, దాన్ని దాటి సీతను రావద్దన్నాడనీ మనం చదివాం. ఇలా వాల్మీకి రాయలేదు. అవి ప్రక్షిప్తాలు (interpolations).

రావణుడు తన చేతుల్తో సీతను పట్టుకుని ఎత్తి ల తన భుజం మీద వేసుకుని తీసుకెళ్లాడు‌ అని వాల్మీకి రామాయణం.

సీతను తాకకుండా భూమితో సహా పెళ్లగించి తీసుకెళ్లడం వాల్మీకి చెప్పింది కాదు. సీతను రావణుడు ముట్టుకున్నాడనడం బావుండదని తరువాతి రోజుల్లో మూలంలో లేనిది చెప్పబడింది.

ఏ‌ దుర్మార్గుడో ఒక ఉన్నతమైన స్త్రీని‌ ముట్టుకుని ఎత్తుకెళ్లడం వల్ల ఆ స్త్రీ అపవిత్రురాలు అయిపోదు. ఆమె శీలం పోదు‌. ఒక దుర్మార్గుడి చెయ్యి తగిలినంత మాత్రాన ఒక స్త్రీ పతివ్రత కాకుండా పోదు.

ఇదే రామాయణం‌ మానవాళికి తెలియజెప్ప చూసిన పాఠం. ఉన్న‌ దాన్ని మార్చి చెప్పడం వల్ల రామాయణ హృదయం తెలియరాకుండా పోతుంది; రావాల్సిన విజ్ఞత రాకుండా పోతుంది.

రామాయణం వంటివి మనకు దైనందిన జీవనానికి స్ఫూర్తినిస్తాయి.‌ మనకు మనో వికాసాన్నిస్తాయి. సరైనవి చదవడంతోనూ, సరిగ్గా చదవడంతోనూ మనల్ని మనం సరిచేసుకోవాలి.

రోచిష్మాన్
9444012279

Post a Comment

0 Comments