*తేనెటీగ* రూపసాధన

*తేనెటీగ*
రూపసాధన

సూ: కర్మధారయంబులందు త్తునకచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.(బా.వ్యా.సం.28)
ఉదా: కఱకు+అమ్ము=కఱకుటమ్మ(ట్)ఆగమం
ఇలాగే
నిగ్గుటద్దము,సరసపుటలుక.
వీటిలో పూర్వపంలో ఉత్(హ్రస్వం)ఉంది కనుక ఈ సూత్రం సరిపోతుంది.

ఇక రెండవది
సూ: కర్మధారయంబునందు బేర్వాది శబ్దముల కచ్చు పరంబగునప్పుడు టుగాగమంబ విభాషనగు.(బా.వ్యా.సం.29.)

ఉదాహరణకు:
పేరు+ఉరము=పేరుటురము,పేరురము
ఇలాంటివే
చిగురుటాకు,చిగురాకు
పొదరుటిల్లు,పొదరిల్లు.

ప్రస్తుత అంశానికి వస్తే

తేనెటీగ
లో
తెనె + ఈగ
ఇందులో పూర్వపదంలో ఉత్తు(హ్రస్వం)లేదు
తే(న్+ఎ)
ఎత్త్వం ఉంది
ఆ సూత్రం పొసగదు.

అందువలన

సూత్రం: ఉదంతేతరంబుల కచ్చు పరంబగునప్పుడు టుగాగమంబు గొండొకచోఁజూపట్టెడు.
ముక్తలక్షణ కౌముది(సంధి.52) (వం.రామకృష్ణారావు

ఉత్(హ్రస్వం)కాని వాటికి అచ్చు పరమయినప్పుడు ట్ ఆగమం కొన్ని చోట్ల కనపడుతున్నాయి.

పల్లెటూరు(శ్రీనాథుని చాటువు)
దుక్కిటెద్దు(నీలా సుందరి పరిణయం 1-49)
పడకటిల్లు ఇత్యాదులు.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments