*ఊచ కోత*
---------------------------
ఉగ్ర దాడులు లేదా జాతుల మధ్య జరుగుతున్న యుద్ధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ *'ఊచకోత'* అనే పదం ఎక్కువగా వినబడుతుంది. ఉదా : కాశ్మీర్ లోని స్థానిక ప్రజలను ఉగ్రవాదులు ఊచకోత కోసారు.
ఇంగ్లీషులో 'Massacre' అంటున్నాము. ఇది ఒక పలుకుబడి.
ఊచ = చెట్టు యొక్క బోదె, ముఖ్యమైన కేంద్ర భాగం, విత్తనం.
కోత = కోయడం అంటే చంపడం.
ఉగ్ర దాడుల, జాతుల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక వర్గానికి/ ఒక తెగకు చెందిన ప్రజలను సమూలంగా ఎలాంటి వారసులు లేకుండా ( చెట్టును ఉద్దేశించి చెబుతున్నప్పుడు బోదెతో సహా, మూలంతో కూడా ) నాశనం చేయడం ఊచకోత. అంటే ఆ జాతిని/ వర్గాన్ని శేషం లేకుండా అంతం చేయడం అని అర్థం. అయితే ఇప్పుడు పైన చెప్పుకున్న సామ్యంతో మనుషులను సామూహికంగా హత్య చేసినప్పుడు కూడా *ఊచకోత* అని పత్రికలు రాస్తున్నాయి . 'సామూహిక హననం' అనే సందర్భంలో ఈ పలుకుబడిని వాడొచ్చు. పలుకుబడికి ఉన్న ప్రత్యేకత అదే... ఒక రెండు మూడు వాక్యాల్లో చెప్పదలుచుకున్న భావాన్ని....ఒక చక్కటి పదంతో అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు. "అయ్యో! పాపం చాలామంది అమాయక ప్రజలను ఒకేసారి కిరాతకంగా చంపేశారట ఎంత ఘోరం!" ఈ వాక్యాన్ని ఒక్క మాటలో 'ఊచ కోత' అంటే అయిపాయె.
-----------------------------------
_కృష్ణారావు దుమ్ము_

0 Comments