*మున్నుడి* రూపసాధన.
ముందు + నుడి = మున్నుడి.
సూ: అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి.
ఈ సూత్రం ప్రకారం ఒకానొక శబ్దానికి ఒకానొక శబ్దం పరమైనచో పూర్వం లాగా (అంటే ప్రాతాదుల లాగా) లోపం, నుగాగం, కొండకొక శబ్దానికి ఒకానొక శబ్దం పరమైనప్పుడు లోపం, ద్విత్వాలు ప్రయోగాల్లో చూపెడతాయని భావం.
అంటే ప్రాతాదుల్లో చేరని ఇతర శబ్దాలకు కూడా లోప ,నుగాగమాలు, లోప ద్విత్వాలుళకొన్ని చోట్ల కనపడాయి.
ముందు + నుడి = మున్నుడి.
ము+ నుడి - లోపం
ము+ న్నుడి - ద్విత్వం
లోపం,ద్విత్వం వచ్చి
మున్నుడి రూపం ఏర్పడినది.
ఇలాంటివే మరికొన్ని:
నివ్వెఱ - నిండు+ వెఱ
నెవ్వఱఁగు - నిండు + వెఱఁగు
నెత్తఱి - నెఱ + తఱి
నెన్నడుము + నెఱ + నడుము
నెమ్మది- నెఱ+ మది
నెవ్వడి - నెఱ + వడి
*పైడి నాగ సుబ్బయ్య*
0 Comments