"శల్య సారథ్యం"

"శల్య సారథ్యం"
              03-01-2023
శల్యుడు సహదేవులకు మేనమామ. అతడు గొప్ప వీరుడు. రథసారథ్యంలో కృష్ణుడికి ధీటైనవాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అతడిని పాండవులు తమ పక్షాన ఉండమని కోరడానికి ఆహ్వానించారు. శల్యుడు ససైన్యంగా బయలుదేరాడు. అది తెలుసుకున్న దుర్యోధనుడు మార్గమధ్యంలోనే అతడిని కలుసుకొని తన భటులచే అనేక శుశ్రూషలు చేయించాడు. తనకు జరిగిన సపర్యలకు ఎంతో సంతృప్తి చెంది,శల్యుడు దుర్యోధనుడిని నీ కోరిక ఏమిటి? అని అడిగాడు. యుద్ధంలో తన తరఫున ఉండాలని దుర్యోధనుడు కోరాడు. శల్యుడు అలాగేనని మాట ఇచ్చాడు. తర్వాత పాండవుల దగ్గరికి వెళ్లి ధర్మరాజుకు జరిగింది చెప్పాడు. ధర్మరాజు "కర్ణుడికి రథసారథ్యం వహించినప్పుడు శూలాల వంటి మాటలతో కర్ణుడిని అవమానించి, నిరుత్సాహపరిచి అర్జునుడికి అతని పరాజయాన్ని సుగమం చెయ్యి" అన్నాడు. దానికి "సరే"నన్నాడు శల్యుడు.కురుపాండవ యుద్ధంలో కర్ణుడి రథానికి శల్యుడు సారధి అయ్యాడు. అతడు అర్జునుడిని పొగిడి, కర్ణుడిని కించపరచి, అతని ఏకాగ్రతను పాడుచేసి అతని మరణానికి, కౌరవ పరాజయానికి కారకుడయ్యాడు. ఈ భారత కథ ఆధారంగా తన పక్షం వారికి కాక ఎదుటి పక్షం వారికి సహాయం చేసే కార్యక్రమాలను చేపడుతూ నాయకత్వం వహించడాన్ని "శల్య సారధ్యం" అని పేర్కొంటారు.
రచన:-ధరణీప్రగడ శేషగిరిరావు
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

Post a Comment

0 Comments