అందులోని ఆరు రకాలు.
1.సాదృశ్యం:-అబ్రాహ్మణః
లౌకిక విగ్రహం = న బ్రాహ్మణః
అలౌకిక విగ్రహం = న బ్రాహ్మణ + సుఁ
(తెలుగులో "న బ్రాహ్మణ" ఆని విగ్రహ వాక్యం)
ఇక్కడ సదృశార్థం వల్ల అబ్రాహ్మణ అంటే నఞ్ తో పాటు ప్రయొక్తమైన పదార్థమునకు భిన్నమైనది, ఇంకా అటువంటి పదార్థమునకు సదృశమైనది అని అర్థం . అబ్రాహ్మణ అంటే బ్రాహ్మణ భిన్నమైనది మరియు బ్రాహ్మణ సదృశార్థమైనది అయిన క్షత్రియాదులను గ్రహించాలి కానీ, లోష్ఠం మొదలైన వాటిని గ్రహించకూడదు. దీనిని పర్యుదాస ప్రతిషేధం అంటారు.
2. అభావం:- అభావం (న భావః అని విగ్రహ వాక్యం) అంటే నఞ్ తో పాటు ప్రయొక్తమైన పదార్థం యొక్క అనుపస్థితి (లేక పోవడం). అభోజనం అంటే భోజనం యొక్క అభావం. అంటే భోజనం లేకపోవడం. ఇట్లే అపాపం.
3. తదన్యత్వం :- తద్ అన్యత్వం (తదన్యత్వం) అంటే నఞ్ తో పాటు ప్రయొక్తమైన ఇతర పదార్థ గ్రహణం అని అర్థం. న ఘటః (న ఘటః అని విగ్రహ వాక్యము) అంటే ఘటభిన్నం ఏదైనా అని అర్థం. అదే సదృశార్థం అయితే ఘటభిన్నమైనది, మట సదృశం అయినది అని అర్థం.
4. అల్పత్వం:-
తద్ అల్పతా అంటే నఞ్ తో పాటు ప్రయుక్తమైన పదార్థం యొక్క అల్పత్వం. అనుదరీ కన్యా (అల్పోదరీ కన్యా అని విగ్రహ వాక్యము) అంటే అల్పమైన ఉదరం గల కన్య అని అర్థం. ఉదరం యొక్క అల్పత్వం అని అర్థం.
5. అప్రాశస్త్యం:- అప్రాశస్త్యం అంటే నఞ్ తో పాటు ప్రయుక్తమైన పదం యొక్క అర్థం ప్రశస్తం కాకపోవడం అంటే హీనం అవడం. అపశవః (అప్రశస్తాః పశవః = ప్రశస్తం కాని పశువులు అని విగ్రహ వాక్యము.) అంటే పశులక్షణములు తక్కువగా గలవి అని అర్థం. అబ్రాహ్మణ అంటే అప్రశస్తమైన బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణ లక్షణ హీనుడు అని అర్థం. అధనం అంటే ప్రాణుల చర్మాన్ని అమ్మి సంపాదించిన అధమ మైన ధనం అని అర్థం
6. విరధము:- విరోధం అంటే నఞ్ తో పాటు ప్రయుక్తమైన పదం యొక్క అర్థంనకు విరోధమైనది అని అర్థం. అధర్మః (ధర్మ విరుద్ధమైనది), అసత్యం (సత్య విరుద్ధం అయినది) , అనాచారః అంటే అచార విరుద్ధమైనది అని అర్థం.
న ధర్మః, న సత్యం, న ఆచారః అనేవి విగ్రహ వాక్యాలు.
ఇవి నఞ్ తత్పురుష సమాసం లోని రకాలు.
మా గురువు గారు
శ్రీ చి. విజయకుమార్ గారి వివరణ

0 Comments