"తెలుగు పాట"
పల్లవి:-
చక్కెర కలిపిన తియ్యని కమ్మని
తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడగల
హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన
ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి
పుట్టినిల్లు తెలుగు
(చక్కెర)
చరణం1
హిమగిరి జలనిధి పదములనమరిన
జిలుగు వెలుగు తెలుగు-------
ప్రణయ పిపాసల రసధుని చేతల
కవితలెల్ల పలుకు
నవనవ పదములు కవితారజములు
సాగిపోవు నెలవు
(చక్కెర)
చరణం2
అల్లసాని అల్లికల జిగిబిగిని
అమృతధార తెలుగు
శ్రీనాధుని కవితా సుధారలో
అమరగంగ పరుగు------
రాయలకల్పనలో,రామకృష్ణుని శిల్పములో (2)
రసధారయై,ధృవతారయై
దేశభాషలలో లెస్సయై
దేవభాషతో చెలిమి చేసి
పలుదేశ దేశముల వాసికెక్కినది
(చక్కెర)
చరణం3
అక్షరాల తీరు మల్లెపాదు కుదురు (మన) (2)
మనభాష పాలకడలి---------
భావం మృదు మురళి (2)
అజంత పదముల అలంకృతం,
మనభాష అమృత జనితం
భారత భాషా భారతి నుదుట
తెలుగు భాష తిలకం
(చక్కెర)
రచన:-జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
మునిపల్లి.
0 Comments