"చిరిగిన చొక్కా అయినా తోడుక్కో - మంచి పుస్తకం కొనుక్కో" ...
."పుస్తకం హస్తభూషణం" .......మానవ చరిత్ర మొదలు ,మనిషిని జంతువు నుండి వేరు చేసినది భాష , దానిని స్తిరపరచినది లిపి. అయితే ఆ భాషను, లిపిని భద్రపరిచినది పుస్తకం. అంతటి మహోన్నత విలువ గలది పుస్తకం .
మనచరిత్రను ,సంస్కృతిని ,నాగరికతను ,విలువలను తరువాతి తరానికి అందించే వారధి ఈ పుస్తకం. వ్యక్తులనే కాదు చరిత్రను సైతం మార్చిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. నేడు ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా మానవ జీవితంలో పుస్తక స్థానం ఎప్పటికీ పదిలమే . అయితే నేటి తరంలో రాను రాను పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తుంది . మొబైల్ ఫోన్లలో అంతర్జాలం లో అందుబాటులో వున్న సమాచారం చూసి చదవడానికి అలవాటు పడిపోవాదం వల్ల పుస్తకాల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది .
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డిజిటల్ రూపంలో ఉన్నా కూడా అది పుస్తకమే అనే సంగతి మర్చిపోకూడదు. సాహితి వేత్తలకు, రచయితలకు , పుస్తక ప్రియులకు, సాధారణ పాఠకులకు పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యత ,వాటి సేవలు , ప్రచురణకర్తలు ,కాపీరైట్స్ వంటి విషయాలను గురించి చర్చించడానికి విశ్లేషించడానికి, సమస్యలు తీర్చుకోవడానికి అభినందించుకోవడానికి యునెస్కో ఏర్పాటు చేసిన ప్రత్యేక రోజే "ప్రపంచ పుస్తక దినోత్సవం " (ప్రపంచ పుస్తక మరియు కాపీ రైట్ దినోత్సవం ). దీనిని ప్రతి సంవత్సరం ఏప్రియల్ 23 న జరుపుకోవడం జరుగుతుంది.
ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు ? 2022 వ సంవత్సరం ఎన్నవ పుస్తక దినోత్సవం ?
యునెస్కో వారు మొట్టమొదటి ప్రపంచ పుస్తక దినోత్సవం ను 1995 వ సంవత్సరం నుండి ఏప్రియల్ 23 వ తేదీన నిర్వహించడం జరిగింది .ఈ సంవత్సరం మనం 25 వ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ప్రారంభ చరిత్ర ఏమిటి ??
చరిత్ర లోకి వెళితే మొట్టమొదటి పుస్తక దినోత్సవం స్పెయిన్ రచయిత మిగ్యుల్ డి సెర్వాటెస్ పుట్టినరోజు పురస్కరించుకుని గౌరవార్ధం అక్టోబర్ 7, 1926 నా జరిగింది . ఆ తర్వాత అతను ఏప్రియల్ 23 ,1930 న మరణించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని తదుపరి పుస్తక దినోత్సవాన్ని అప్రియల్ 23 నిర్వహించడం జరిగింది .
అయితే యునెస్కో ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్ స్పియర్ వర్ధంతి మరియు అనేక మంది రచయితల వర్ధతులు ,జయంతులు ఏరియల్ 23 వ తేదీని 1995 వ సంవత్సరం లో ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవంగా ప్రకటించింది . నేడు ప్రపంచంలో చాలా దేశాలు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. .
లక్ష్యం ఏమిటి ?
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించం,దాని ప్రాముఖ్యతను తెలియజేయడం , పుస్తక సేవలను గుర్తుచేసుకోవడం , రచయితలు , సాహితి వేత్తలు మరియు కవులు వారి రచనలును అభినందించడం , కాపీ రైట్స్ ,ప్రచురణల గురించి అవగాహన కల్పించడం .
పుస్తక రాజధాని అంటే ఏమిటి ?
యునెస్కో ప్రతి సంవత్సరం ఏప్రియల్ 23 నుండి ఒక సంవత్స్రాకాలమ్ పాటు ఒక నగరాన్ని పుస్తక రాజధానిగా ప్రకటించి , అక్కడ గ్రంధాలయాల అభివృద్ధి , ప్రచురణ కర్తలు వారి సమస్యల పరిష్కారం ,పుస్తక పాతనాన్ని ప్రోత్సహించే అనేక కార్యక్రమాలను నిర్వహించం చేస్తుంది.
2022 సంవత్సరానికి గాను గ్యాడిలజారా,మెక్సికో నగరాన్ని పుస్తక రాజధానిగా ఎంపిక కాబడినది .
మనదేశం ఎప్పుడైనా పుస్తక రాజా ధానిగా ఎంపిక కాబడినదా?
మన దేశంలో పుస్తకాలను ప్రత్యేక స్థానం వుంది . ఎన్నో ఈల సంవత్సరాలకు పూర్వమే మనం అధ్బుత రచనలను ప్రపంచానికి అందించాము . పుస్తక రచయితలు ,కవులు ఎప్పుడు గౌరవించబడుతూనే వున్నారు . అయితే మన దేశంలోని న్యూ ఢిల్లీ నగరం 2003 సంవత్సరానికి గాను పుస్తక రాజధానిగా చేయబడినది .
మన బాధ్యత ...
తరాలు మారినా , సాంకేతికత పెరిగినా , మనిషి చంద్రమండలానికి చేరినా మనిషి ప్రవర్తనను , నియమావళిని , ఉన్నత ఆశయాలను సాధనకు దిశామార్గం నిర్ధేషించగల సామర్ధ్యం ఒక మంచి పుస్తకానికి వుంది. మంచి పుస్తకం చదివిన రోజు నీ జీవితంలో సంపూర్ణంగా వినియోగించబడిన రోజని చెప్పవచ్చు. పుస్తకాల విలువను తెలియజెప్పి తరువాతి తరానికి పుస్తకాన్ని చేరువ చేసే బాధ్యత మనందరి పైన ఉంది.
పుస్తక ప్రియులందరికి ప్రపంచ పుస్తక దినోత్సవం శుభాకాంక్షలు ...
📚📚📚📚📚📚📚

0 Comments