96 సంవత్సరాల 11 నెలల 20 రోజుల చరిత్ర కలిగిన ఈ పశ్చిమగోదావరి జిల్లా నేటి నుండి రెండు జిల్లాలుగా విడిపోతుంది.

96 సంవత్సరాల 11 నెలల 20 రోజుల చరిత్ర కలిగిన ఈ పశ్చిమగోదావరి జిల్లా నేటి నుండి రెండు జిల్లాలుగా విడిపోతుంది.

1) పశ్చిమగోదావరి జిల్లా
2) ఏలూరు జిల్లా 


15th April 1925 లో కృష్ణా జిల్లాలో అంతర్భాగం ఉండే ఈ జిల్లా ను, కృష్ణాజిల్లా నుండి  విడదీసి, పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నుండి కొంత భాగాన్ని , కృష్ణా జిల్లా నుండి కొంత భాగం మేలి కలయికతో ఈ పశ్చిమగోదావరి జిల్లా ఆవిర్భావం చేసుకుంది. దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధాన్యగారం అందించేది మన పచ్చని పశ్చిమగోదావరి జిల్లా ...

తూర్పున గోదావరి నది, పశ్చిమాన కృష్ణా జిల్లా, ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా మరియు బే ఆఫ్ బెంగాల్ మహా సముద్రం సరిహద్దుగా గల మన పశ్చిమగోదావరి జిల్లా 1925  పూర్వం అప్పటి మద్రాసు రాష్ట్రంలో కృష్ణాజిల్లాలో అంతర్భాగంగా ఉండేది. కానీ అప్పటి పరిపాలనా సౌలభ్యం కొరకు ఆంగ్లేయులు కృష్ణా జిల్లా నుండి వేరు చేసి ఏలూరు రాజధానిగా 15 ఏప్రిల్ 1925వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రాంతం గోదావరికి పశ్చిమ ముఖంగా ఉండటం వలన దీనికి పశ్చిమ గోదావరి  అని పేరు వచ్చింది.


పూర్వం మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాని మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, బదామి పశ్చిమ చాళుక్యులు,వేంగి తూర్పు చాళుక్యులు, చాళుక్య చోళులు, వెలనాటి చోళులు, కొలను ముఖ్యులు. పాలించారు. తర్వాత 1518 లో ఈ ప్రాంతం గోల్కొండ కుతుబ్షాహీలు యొక్క ఆధ్వర్యంలో కి వెళ్ళింది. తర్వాత ఔరంగజేబు గోల్కొండ ని ఆక్రమించుకోవడంతో ఈ ప్రాంతం మొఘలుల యొక్క పాలనలోకి వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాద్  నిజాం యొక్క పరిపాలన, ఆఖరిగా గా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన లోకి వెళ్ళింది ...

ప్రస్తుతం ఈ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 15 నియోజకవర్గాలు, 48 మండలాలు, సుమారుగా 850 పంచాయతీలు ఉన్నాయి...

పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు. 
రైస్, పంచదార, జనపనార, నూనె, టెక్స్టైల్స్, రసాయనాలు, ఆహార పరిశ్రమలు, అగర్బత్తి, ఇటుకలు, పీచు లేస్ , ఆక్వా పరిశ్రమలు.

జిల్లా యొక్క వైశాల్యం 7742 చదరపు కిలోమీటర్లు .ఈ యొక్క జిల్లాలో 13 పట్టణాలు ,881 గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా జనాభా 39,36,966 . అందులో మగవారి సంఖ్య 19,64,918. ఆడవారు : 1972048. అలాగే ఆరు సంవత్సరాల లోపు ఉన్న వారి సంఖ్య 3,82,887.  మన జిల్లాలో మొత్తం 10,91,525 కుటుంబాలు నివసిస్తున్నాయి. అలాగే ఒక్క ఒక చదరపు కిలోమీటర్ కి 509 మంది నివసిస్తున్నారు. మన జిల్లాకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు మన జిల్లాలో 1004 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతం 2020 వ సంవత్సరానికి ఇంచుమించుగా లెక్క వేసుకుంటే మన జిల్లా జనాభా 41,97,258 ఉన్నారని అంచనా ...

పశ్చిమ లో ఎక్కువ చేసేది వ్యవసాయం ... అది మన సంప్రదాయం అనే సిద్ధాంతంతో ఇక్కడ పాడిపంటలకు పెద్ద పీట వేస్తారు.

ఈ రోజు నుండి ఈ మ్యాప్ రెండు భాగాలుగా అవుతుంది 😔😔

Post a Comment

0 Comments