గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం ఆంధ్ర వైతాళికులు 1. వీరేశలింగం అనంతరం ఆంధ్రలో సాంస్కృతిక పునర్వికాసానికి నిర్విరామకృషి చేసిన మహాపురుషుడు - రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939 -కులపతి బిరుదు)

గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఆంధ్ర వైతాళికులు
1. వీరేశలింగం అనంతరం ఆంధ్రలో సాంస్కృతిక పునర్వికాసానికి నిర్విరామకృషి చేసిన మహాపురుషుడు  - రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939 -కులపతి బిరుదు)


2. బ్రహ్మప్రకాశిక, పీపుల్స్‌ఫ్రెండ్‌, ఫెలోవర్కర్‌ అను పత్రికలకు సంపాదకుడుగా ఉన్నవారు - రఘుపతి
3. ప్రజల శీల, ప్రవృత్తులను తీర్చిదిద్దడానికి రఘుపతి 1891 సంవత్సరంలో మచిలీపట్నంలో - సాంఘిక శుద్ధి సంఘం స్థాపించాడు (సోషల్‌ ప్యూరిటీ అసోసియేషన్‌)
4. రఘుపతి వారు చేసిన సేవలకు ఆంగ్లప్రభుత్వం ఆయనకు ఏ బిరుదులు ప్రసాదించింది
- రావు బహద్దుర్‌, దివాన్‌బహద్దూర్‌ (బ్రహ్మర్షి)
5. కవయిత్రిగా, సంఘ సంస్కర్తగా, జాతీయవాదిగా పేరుపొందిన ఆంధ్ర మహిళ (1879-1949). (భారత కోకిల - నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా) - సరోజనీ నాయుడు
6. సరోజనీ నాయుడు రచనలు  - ది లేడి ఆఫ్‌ ద లేక్‌ (సరస్సు సుందరి)
- ది గోల్డెన్‌ థ్రెష్‌హోల్డ్‌ (సువర్ణ ద్వారము) 1915 - ది బ్రోకెన్‌ వింగ్‌ (విరిగిన రెక్క) 1917
- ది బర్డ్‌ ఆఫ్‌ టైమ్‌ (కాల విహంగము) 1912- ది స్కేప్టర్డ్‌ ఫ్లూట్‌ 1913
7. సరోజనీనాయుడుని దేనితో పోల్చారు - ఇండియన్‌ టోరు డట్‌
8. సరోజనీనాయుడు - ది స్కేప్టర్డ్‌ ఫ్లూట్‌ రచనకు - కైజర్‌ -ఇ-హింద్‌ సువర్ణపతకం లభించింది. తత్ఫలితంగా ఆమె 1914లో - రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌కు ఎన్నికయ్యారు
9. 1925లో కాన్పూర్‌లో జరిగిన ఐఎన్‌సికి అధ్యక్షులు ఎవరు
- సరోజనీనాయుడు
10. 1930లో గాంధీజీతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న మహిళ - సరోజనీనాయుడు
11. 1931లో లండన్‌లో జరిగిన రెండో అఖిలపక్ష సమావేశానికి గాంధీజీతో పాటు పాల్గొన్న మహిళా ప్రతినిధి
- సరోజనీనాయుడు
12. పాత్రికేయులు సరోజనీనాయుడిని భారత భూమిని ఉత్తేజపరచడానికి జన్మించిన - జాన్‌ ఆఫ్‌ ఆర్క్‌గా కొనియాడారు
13. భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌ (యు.పి)
- సరోజనీనాయుడు
14. ఆంధ్రరత్న బిరుదుగల వ్యక్తి - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (1889-1928)
15. దుగ్గిరాలను ఏ సంస్కృత గ్రంథాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు - అబినయదర్పణం
16. విద్యారంగంలో పరిశోధనలు జరపడానికి చీరాలలో 1920లో 'ఆంధ్ర విద్యాపీఠగోషి' స్థాపించారు - దుగ్గిరాల
17. దుగ్గిరాల ఏర్పరచిన ఎర్రదుస్తుల యూనిఫారమ్‌ ధరించిన స్వచ్ఛంద సేవాదళం లేక శాంతిసేన - రామదండు (1921 సంవత్సరంలో 1000 మంది సభ్యులు ఉన్నారు)
18. గాంధీజీ పిలుపుని అందుకుని, దుర్గిరాల సహాయ నిరాకరణోద్యమంలో చేరి, ఏ పన్నుల నిరాకరణోద్యమాన్ని నిర్వహించారు - చీరాల - పేరాల
19. చీరాల - పేరాల సమరంలో వీరనాయకుడిగా భాసిల్లిన దుగ్గిరాలకు పొట్నూరులో జరిగిన (1921) జిల్లా ఆంధ్రమహాసభ ఏ బిరుదును ఇచ్చింది - ఆంధ్రరత్న
20. ఏ సూత్ర గ్రంథాన్ని దుర్గిరాల రూపొందించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు - బ్రాహ్మణస్మృతి
21. ఆంధ్రకేసరి అనే బిరుదుగల వారు - టంగుటూరి ప్రకాశం పంతులు (1869-1957)
22. ప్రకాశం 1903లో ఇంగ్లండ్‌ వెళ్లి 'గ్రే-ఇన్‌'లో బారిష్టర్‌ పట్టాను పుచ్చుకుని, ఏ సర్టిఫికెట్‌ను సంపాదించారు - సర్టిఫికెట్‌ ఆఫ్‌ హానర్‌
23. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బారిష్టర్‌ పట్టాను పొందిన ఘనత - ప్రకాశానికి దక్కింది
24. పట్టాభి, రాజాజీ, కాశీనాథుని సలహామేరకు ఏ ఆంగ్ల దిన పత్రికను 1921లో స్థాపించారు - స్వరాజ్య
25. 1928లో సైమన్‌ కమిషన్‌ మద్రాసు వచ్చినప్పుడు టంగుటూరి ధైర్యంగా ఎదిరించి ఏ బిరుదును పొందారు  - ఆంధ్రకేసరి
26. 1930 ఉప్పుసత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ శిబిరాన్ని ఎక్కడ స్థాపించారు - మైలాపూరు (దీని నిర్వహణను ప్రకాశానికి అప్పగించారు)
27. 1937లో మద్రాసు రాష్ట్రాన్ని సి.రాజగోపాలాచారి నాయకత్వాన ఏర్పడిన మంత్రివర్గంలో ప్రకాశం
- రెవిన్యూ మంత్రి అయ్యారు
28. ప్రకాశం ఏ వారపత్రిక ఆంగ్ల, ఆంధ్ర, తమిళ భాషలలో నిర్వహించారు - గ్రామస్వరాజ్య
29. వ్యక్తి సత్యాగ్రహంలో ప్రకాశం ఎప్పుడు పాల్గొన్నారు
- 1940 అక్టోబరు 17
30. 'నా జీవితయాత్ర' అనే స్వీయ చరిత్ర ఎవరిది?
- టంగుటూరి
31. 1946లో ప్రకాశం మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు - (ఎయు-డి.లిస్ట్‌ గౌవ డిగ్రీ బహూకరణ)
32. ప్రకాశం సిఎంగా తలపెట్టిన ఫిర్కాడెవలప్‌మెంట్‌ ప్రణాళికలే నేటి - బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికలు
33. ప్రకాశం, ఆచార్య కృపలానీ, పి.సి ఘోష్‌లితో కలిసి 'కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ' స్థాపన తర్వాత - ప్రజాసోషలిస్టు పార్టీగా రూపొందించారు
34. 1952 నాటి మద్రాసు ముఖ్యమంత్రి
- సి.రాజగోపాలాచారి (రాజాజీ)
1952 నాటి మద్రాసు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు
- ప్రకాశం (ఆంధ్రకేసరి)
35. 'చెన్నయి నగరము ఆంధ్ర నగరమే' గ్రంథకర్త
- టంగుటూరి
36. 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ప్రకాశం ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది
- తొలిముఖ్యమంత్రి - ఆంధ్రరాష్ట్రం
37. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపనకు, విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజీ నిర్మాణానికి దోహదం చేసింది
- ప్రకాశం కృషి ఫలితంగా
38. ఆంధ్రోద్యమ పితామహుడు + దేశభక్తి బిరుదుగలవారు
- కొండా వెంకటప్పయ్య (1866-1949)
39. 1902, ఫిబ్రవరిలో బందరులో ఏ పత్రికను స్థాపించి, దానికి కొండా వెంకటప్పయ్య సంపాదకుడయ్యారు - కృష్ణాపత్రిక
40. కేరళలో గురువారయూరు సత్యాగ్రహంలో
- వెంకటప్పయ్య పాల్గొన్నారు
41. 1913 సంవత్సరంలో బాపట్లలో జరిగిన ప్రధమాంధ్ర సభకు అధ్యక్షుడు - వెంకటప్పయ్య
42. ఆంధ్రోద్యమము, స్వీయ చరిత్ర, సృష్టివిచారము, డచ్‌రిపబ్లిక్‌ మరియు వెంకటేశ్వర సేవానందలహరి మొదలైనవి - దేశభక్తి రచనలు
43. కోపల్లె హనుమంతరావు + ముట్నూరు కృష్ణారావు + పట్టాభిలు కలిసి 1910 సంవత్సరంలో బందరులో
- ఆంధ్రజాతీయ కళాశాలను స్థాపించారు
44. జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించినవారు
- డాక్టర భోగరాజు పట్టాభిసీతారామయ్య (1880-1959)
45. గాంధీజీ మాటమేరకు 1939 త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి (ఐఎన్‌సి) నేతాజీతో పోటీచేసి ఓడిపోయింది
- డాక్టర్‌ భోగరాజు
46. జన్మభూమితోపాటు 'సహకార' సంస్థాన ప్రజోద్యమమునకు (నేటివ్‌ పీపుల్‌) అనే పత్రికను మద్రాసు నుంచి ఏ పత్రికను స్థాపించారు - ఇండియన్‌ రిపబ్లిక్‌
47. డాక్టర్‌ భోగరాజు - జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర (హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) గ్రంథాన్ని రాశారు
48. 1948లో ఐఎన్‌సి -ప్రెసిడెంట్‌ - డాక్టర్‌ భోగరాజు (జయపూర్‌ సమావేశం)
49. 1947లో భాషా ప్రయుక్త రాష్ట్ర పునర్నిర్మాణ కమిటీలో అనగా 'జెవిపి' కమిటీలో - డాక్టర్‌ భోగరాజు సభ్యుడు
50. దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ అసలుపేరు - గుమ్మడిదల దుర్గాభాయి (1909-1981)
51. 1946 రాజ్యాంగ పరిషత్‌ సభ్యురాలై దాని సారధ్య సంఘానికి ఎన్నికయిన ఏకైక మహిళ - దుర్గాభాయి
52. జాతీయ విద్యామండలికి దుర్గాభాయి తొలి - అధ్యక్షురాలు
53. దుర్గాభాయి భర్తపేరు - చింతామణి ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌
54. దుర్గాభాయి - 1939లో మద్రాసులో 'ఆంధ్రమహిళా సభను స్థాపించారు
55. నీలం, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మొదలైనవారు దుర్గాభాయిని - ఆంధ్రమహిళ అని పిలిచేవారు
56. గద్యతిక్కన బిరుదు ఎవరికి ఉంది - కందుకూరి వీరేశలింగం (1848-1919)
57. ఆంధ్రజాతి పునర్వికాసపిత - ఫాదర్‌ ఆఫ్‌ ఆంధ్రా రీనైసెన్స్‌) ఎవరు - కందుకూరి (ఆంధ్ర వైతాళికుడు) గత్య వాజ్మయిబ్రహ్మ
58. ఆంధ్రలో సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు ఎవరు - కందుకూరి
59. 1974 సంవత్సరంలో ఆంధ్రదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించినది - కందుకూరి
60. ఆంధ్రలో మొట్టమొదటి బాలికల పాఠశాలకు హెడ్‌ మాస్టర్‌ ఎవరు - మల్లాది అచ్చన్నశాస్త్రి
61. వివేకవర్దిని (స్త్రీ విద్య కోసం) పత్రిక స్థాపకుడు
- కందుకూరి
62. కందుకూరి రచించిన 'రాజశేఖర చరిత్ర' తెలుగులో మొట్టమొదటి నవల. ఆంగ్లంలో ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ రచించిన 'వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ ఫీల్డ్‌' అనే నవల తెలుగులో - రాజశేఖర చరిత్రకు ఆధారం
63. కందుకూరి 1881 డిసెంబర్‌ 11న వితంతు వివాహాలకు శ్రీకారం చుట్టారు. ఆ రోజున గోగులపాటి శ్రీరాములు, గౌరమ్మకు వితంతు వివాహం చేశారు. వితంతువుల కోసం 1897లో చెన్నయిలోను, 1905లో రాజమహేంద్రవరంలోనూ వితంతుకు - శరణాలయాలను నిర్మించారు
64. సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు ఆయుధాలుగా కందుకూరి 1876లో - వివేకవర్ధిని, హాస్యసంజీవని అనే పత్రికలు స్థాపించారు
65. స్త్రీ జాతిని జాగృత మొనర్చడానికి కందుకూరి 1883 సంవత్సరంలో సతీహితబోధిని అనే పత్రికను స్థాపించి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై - పెక్కు రచనలు చేశారు
66. సంఘసేవకు గుర్తింపుగా కందుకూరికి ప్రభుత్వం 1893లో - రావుబాహదూర్‌ అనే బిరుదునిచ్చి సత్కరించింది
67. మద్రాసు సమావేశంలో కందుకూరిని మహాదేవ గోవిందరెనడేని - దక్షిణదేశ విద్యా సాగరుడు అని స్తుతించారు (విద్యా సాగర్‌ ఆఫ్‌ సౌథ్‌ ఇండియా)
68. దేశిరాజు పెద్దబాపయ్య, పైడిరామకృష్ణయ్య ఏ రంగంలో విశేషకృషి చేశారు - వితంతు పునర్వివాహం
69. 'నవయుగ వైతాళికుడు'గా ఖ్యాతినార్జిం,చిన వారెవరు - గురజాడ వేంకట అప్పారావు
70. గురజాడ రచనలలో ముఖ్యమైనవి - కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం, ముత్యాలసరాలు, పూర్ణమ్మ కథ, కన్యక... మొదలైనవి
71. కందుకూరి సాంఘిక విప్లవాన్ని, గిడుగు వారి భాషా విప్లవాన్ని సమన్వయపరచి సరికొత్త సాహిత్య విప్లవానికి ప్రారంభకులయ్యారు - గురజాడ
72. 'ఆంధ్ర షేక్‌స్పియర్‌' ఆంధ్ర ఎడిసన్‌ బిరుదులు గలవారు - పానుగంటి లక్ష్మీ నరసింహం
73. 'ఆంధ్ర కవుల చరిత్ర' గ్రంథకర్త - కందుకూరి
74. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు - గిడుగు రామ్మూర్తి
75. ఆంధ్ర నాటక పితామహుడు - ధర్మవరపు కృష్ణమాచార్యులు
76. వైజయంతి పత్రిక స్థాపకులు - పి.ఆనందాచార్యులు
77. దుగ్గిరాల నిర్వహించిన ఆంగ్లపత్రిక - సాధన
78. తెలుగు భాషలో వెలువడిన మొట్టమొదటి పత్రిక
- సత్యదూత
79. మాక్సిమ్‌గోర్కి రచించిన మదర్‌ అనే గ్రంథాన్ని తెలుగు భాషలోకి అనువదించిందెవరు - క్రొవ్విడి లింగరాజు
80. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు - రాజా రామ్మోహనరారు
81. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ప్రథమ స్పీకర్‌ - వెంకటరామయ్య
82. భారతదేశంలో భాషా ప్రతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్‌
83. 1947 ఆగస్టు 7న ఏ రోజుగా పాటిస్తారు - 'జాయిన్‌ ఇండియా దినం'గా పాటిస్తారు
84. 'గబ్బిలం' ఫిరదౌసి గ్రంథకర్త - గుర్రం జాషువా
85. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణకు 'రామాయణ కల్పవృక్షం' రచనకి 1970 సంవత్సరంలో - జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు లభించింది
86. మండవ ఋషి అనేపేరు ఎవరికి కలదు - థామస్‌ మన్రో
87. ఆంధ్ర సోక్రటీస్‌ ఎవరు
- రఘుపతి వేంకటరత్నం నాయుడు


Post a Comment

0 Comments