ఈరోజు కృత్రిమ జన్యువు సృష్టి కర్త,పద్మ విభూషణ్ గ్రహీత,నోబెల్ గ్రహీత హరగోవింద్ ఖొరానా వర్ధంతి
********************************************
హరగోవింద్ ఖొరానా(Har Gobind Khorana) (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రానికు చెందిన రాయపూరు అను గ్రామంలో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది).పద్మ విభూషణ్ గ్రహీత.
విద్య
----------
తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానంలో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో దయానంద్ ఆర్య విద్యా (DAV) ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము, లాహోర్ ( ప్రస్తుతం పాకిస్తాన్ ) 1943 లో B.Sc మరియు 1945లో M.Sc పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వవిద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి Ph.D పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించాడు.
పరిశోధనలు
----------------
1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలములో చేరాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీవిరమణ చేశాడు.
నోబెల్ పురస్కారము
--------------------------------
జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యంగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్"ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ Genetic Engineering అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.
ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది. 1968 లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
Source Wikipedia

0 Comments