_*📚✍ఆర్‌సెట్‌కు ఉపాధ్యాయులకూ అర్హత*_
*Published Sunday, 6 October 2019
*🌻విశాఖపట్నం, అక్టోబర్ 5:* ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ ఆర్‌సెట్ 2019కు ఉపాధ్యాయులకూ అర్హత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్‌సెట్ కన్వీనర్ ఆచార్య కే శ్రీనివాసరావు శనివారం నాడిక్కడ తెలిపారు.
పీజీలో 55 శాతం మార్కులు, అయిదేళ్ల వృత్తి అనుభవం కలిగిన వారు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత కలిగిన వారినుంచి ఈ నెల 16 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఏపీఆర్‌సెట్ పరీక్షలు ఈ ఏడాది నవంబర్ 8 నుంచి 12 వరకూ 70 సబ్జెక్టులకు నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హత కలిగిన వారు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, రూ.2 వేల అపరాధ రుసుంతో ఈ నెల 16 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి పార్ట్‌టైం ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తామన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

0 Comments