💥www.storeknowledge.in
గణితం, ఫిజిక్స్ అంటే ఇష్టపడే పదహారేళ్ళబ్బాయికి ఆ సబ్జెక్ట్ లలో డిగ్రీచేసి "ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనే కోరికతో ప్రాన్స్ లోని స్ట్రాస్ బర్ 'యూనివర్సిటీలో చేరాడు.. అయితే గణితం ఫెయిల్ ,ఫిజిక్స్ ఫెయిల్ ,, GBకెమిస్ట్రీ అత్యసరు మార్కులు...తన ఆశయం సిద్దించపోవచ్చనుకున్నాడు...ఎలాగోలా కష్టపడి డిగ్రీ అయిందనిపించాడు.. అప్పుడే అదే కాలేజ్ లో చదువుతున్న ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ కూతురుని ప్రేమించాడు. అయితే అది నేరుగా ఆమెకు చెప్పకుండా ఫ్రోఫెసర్ గారికే లెటర్ రాశాడు. సర్ మీ అమ్మాయి చాలా బాగా వుంటుంది..నాకెంతో నచ్చింది..నేను ఎలాగోలా ఫిజిక్స్ పాసై లెక్చరర్ గా చేరి ,ఆ జీతంతో మీ అమ్మాయిని సంతోషంగా చుాసుకోగలను..అయితే నాకు ఆస్థిపాస్థులంటూ ఏమీలేవు..చాలా పేదవాడిని. కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేయగలరా అని. అది చదివిన ఆ ప్రొఫెసర్ అతని అమాయకత్వానికి నవ్వుకొన్నాడు.కానీ అతని నిజాయితిని మెచ్చుకొని తన కూతురునిచ్చి పెండ్లి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నాడు...ఆ నిర్ణయమే ప్రపంచానికి ఒక మహా శాస్త్రవేత్తను అందిస్తుందని బహుశా ఆయన ఊహించివుండడు.
అదే యూనివర్సిటీలోనే లెక్చరర్ ఉద్యోగం..ఐదుగురు పిల్లలు సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక్క పెద్ద విషాదకరమైన కుదుపు...ముగ్గురు పిల్లలూ కలరా,మశూచిలతో మరణం. తల్లడిల్లిపోయాడు.
కొన్నిరోజులు కోలుకోలేకపోయాడు...తర్వాత అతని మనసులో తన కుమారులచావుకు కారణమైన వ్యాధికారకాలను కనుగొనాలని ప్రయోగశాల వైపు అడుగులు వేశాడు...ఆ నిర్ణయమే వైద్యరంగంలో ఒక మహత్తరమైన ఆవిష్కరణలకు దారితీసింది.
ల్యాబ్ లో గంటలతరబడి పరిశీలనలు..ఆరోగ్యం దెబ్బతిన్నది..తన 46 యేట పక్షవాతం సోకింది..అయినా భయపడలేదు.పట్టుదల వీడలేదు..పరిశోధనలు ఆపలేదు.ఒక రోజు "పెరాటాక్టేట్ "అనే స్పటికంపై పరిశోధన చేస్తున్నాడు. ఆ రోజు జలుబు అతనికి ..ముక్కు నుండి నీళ్ళు కారతున్నాయి. ఆ రోజు పనిచేయలేక ఇంటికి వెళ్ళి మరసటిరోజు యధాలాపంగా వచ్చి ,పెరా టార్టేట్ ద్రవంపై బూజు వుండటం గమనించాడు. అది నిన్న అతని ముక్కు నుండి జారిపడ్డ ద్రవం నుండి ఏర్పడింది..అంతే స్పటికం వదిలి బూజుపై దృష్టిపెట్టాడు.. అదే వైద్యరంగంలో మహా విస్పోటనం, సూక్ష్మజీవశాస్త్ర సింహద్వారం తెరుసుకుంది. చాలారోగాలకు కారణం సూక్ష్మజీవులగా గుర్తించాడు.. ఎన్నో లక్షలమందిని కాపాడేందుకు కారణమైనాడు...అతడే మైక్రోబయాలజీ పితామహుడు "లూయీ పాశ్ఛర్ "
ఆక్సిజన్ లేని వాతావరణంలో పెరిగే సూక్ష్మజీవుల గురించి పరిశోధనచేశాడు. పాలలో బాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నాడు..ద్రాక్షపై సూక్ష్మజీవులున్నట్లు కనుగొన్నాడు..వీటిని ఎలా నియంత్రించాలో తెలియజేశాడు.. అలాగే కోళ్ళలో పారుడువ్యాధి వచ్చి అపారంగా చనిపోయేవి. ఆ వ్యాధిక కారణమైన సూక్ష్మజీవులను కోళ్ళను గుర్తించి వాటి నుండి సూక్ష్మజీవులను సేకరించి,వాటి శక్తిని తగ్గించి ,వ్యాధిసోకని కోళ్ళలో ఎక్కించాడు. ఇది సత్ఫలితాన్నిచ్చింది..పారుడువ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను ,తగ్గించిన సూక్ష్మజీవులు విజయవంతంగా అడ్డుకొని నిర్వీర్యం చేయగలిగాయి. వ్యాధి వచ్చినప్పటికంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా "టీకాల"ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని లూయీపాశ్ఛర్ తెలియజేశాడు.దాని ఫలితంగా వచ్చిందే "వాక్సినేషన్ ".కలరా..మశూచి..ఫోలియో..డిఫ్తీరియా లాంటి అనేక వ్యాధుల బారినుండి కోట్లమందిని కాపాడగలిగారు దీనిద్వారా.
లూయీ పాశ్ఛర్ మరొక అమూల్యమైన విజయం.. రాబీస్ వ్యాధికి టీకా కనుగొనుటం. రేబిస్ వ్యాధికారకాలు వెన్నుపాము, చిన్నమెదడులలో పెరుగుతాయని గమనించాడు. వాటిని నిర్మూలించేందుకు "యాంటీ రాబీస్ "టీకాను కనుగొని.. 1885 జూలై 6 న జోసఫ్ మీసర్ అనే 9 యేండ్ల బాలుడికి తొలి టీకా వేసినాడు.అది అద్భుతంగా పనిచేసి రాబీస్ నుండి ఆ పిల్లాడిని కాపాడింది...ఆ విజయానికి సూచికంగా ఈ రోజును "జునోసిస్ డే "గా జరుగుకుంటారు..(ర్యాబీస్ అనగా జంతువులనుండి సంక్రమించే వ్యాధి)
ఈరోజు ఎంతోమంది చిన్నారుల ప్రాణాలకు భరోసా కల్పించిన మహనీయుడు లూయిాపాశ్ఛర్ వర్థంతి సందర్భంగా..నివాళులు అర్పిస్తున్నాం!!

0 Comments