🙌సింధూ నాగరికత (క్రీ.పూ. 2500-1750) 🙌
👉రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం’గా పేర్కొంటారు. దీన్ని ‘హరప్పా సంస్కృతి’ అని కూడా అంటారు.
👉1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత’ లేదా ‘హరప్పా నాగరికత’గా వ్యవహరించారు.
👉హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం. దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
👉నాటి మెసపటోమియా, ఈజిప్టు నాగరికత కంటే సింధూ నాగరికత పరిధి చాలా విస్తృతమైంది. ఈ నాగరికతకు చెందిన ప్రజలు గ్రిడ్ పద్ధతి( ఇటుకలు పేర్చు) లో పట్టణాలను నిర్మించారు.
👉మెలుహా ప్రాంతంవారికి సుమేరియన్లతో ఉన్న సంబంధాల గురించి కొన్ని సుమేరియన్ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. సింధూ ప్రాంతాన్ని అత్యంత ప్రాచీన కాలంలో ‘మెలుహా’గా వ్యవహరించేవారు.
హరప్పా నాగరితను పట్టణ నాగరికతగా పేర్కొనవచ్చు. వీధులు ఉత్తర, దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు, పడమరలుగా చక్కని దీర్ఘచతురస్ర ఆకారంలో నిర్మించారు. నిర్మాణాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. భూగర్భ మురుగు పారుదల సౌకర్యం నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. నగర ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం సభా మందిరాన్ని కూడా నిర్మించారు.
👉గోధుమ, బార్లీ వీరి ప్రధానమైన పంటలు.
లోథాల్ నగరంలో పత్తి, వరి పండించినట్లుగా ఆధారాలు లభించాయి. వీరు పాలు, కూరగాయలు, గోధుమ, బార్లీతో పాటు మంసాహారాన్ని కూడా తీసుకునేవారు. ఎద్దు, మహిషం, గొర్రె, పంది, ఒంటె, కుక్క, ఆవు లాంటి పెంపుడు జంతువులు, ఖడ్గమృగం, పెద్దపులి, ఎలుగుబంటి, వానరం తదితర వన్యమృగాలు వీరికి తెలుసు. వీరు యుద్ధాల్లో రాగితో చేసిన గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, బాడిశ తదితర పరికరాలను ఉపయోగించారు. కానీ రక్షణ కవచాలు తెలియదు. గృహ సామగ్రి కోసం రాగి, వెండి, పింగాణీతో పాటు శిలలు, దంతాలతో చేసిన వస్తువులను వినియోగించారు.
👉వీరు దశాంశ పద్ధతిలో తూనికలు ఉపయోగించారు.
👉సింధూ ప్రజలు మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు, లోహ ప్రతిమల ఆధారంగా వీరు ప్రధానంగా మాతృదేవత లేదా అమ్మతల్లిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. మూడు ముఖాలతో పద్మాసీనుడై ఉన్న శివుని చుట్టూ వన్యమృగాలున్న ఒక ముద్రిక లభించింది. దీని ఆధారంగా వీరు పశుపతిగా, మహాయోగిగా శివుణ్ని ఆరాధించేవారని, వృక్షాలు, సర్పాలను కూడా పూజించేవారని తెలుస్తోంది. ‘స్వస్తిక్’ అనేది సూర్య దేవతారాదనకు చిహ్నం. మృతదేహాన్ని పూడ్చి పెట్టేవారు. సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని కుడి నుంచి ఎడమ దిశకు రాసినట్లుగా తెలుస్తోంది.
👉మొహంజోదారో నగరం ఏడుసార్లు ధ్వంసమైనా మళ్లీ నిర్మించారు. ఇక్కడ 4.5 అడుగుల నాట్యం చేస్తున్న స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. వీరికి గుర్రం తెలియదు. అందువల్ల గుర్రాన్ని ఉపయోగించిన ఆర్యులు వీరిని సులభంగా ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం. కొంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ నాగరికత నాశనం చెందడానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
👉సింధూ నాగరికత ప్రజలకు సమకాలీకులైన సుమేరియన్లు ఇనుమును ఉపయోగించినా వీరు దీన్ని వాడలేదు. ఎన్నిసార్లు వరదలు వచ్చినా అదే ప్రాంతంలో నివసించారు. ఈ కారణాల వల్ల వీరికి ఆధునిక పద్ధతులను త్వరగా స్వీకరించే మనస్తత్వం లేదని భావిస్తున్నారు.
👉సింధూ నాగరికత ప్రజల ప్రత్యేకతలు:
వరి, పత్తి పండించడంలో సిద్ధహస్తులు.
తూనికలు, కొలతలను ప్రామాణికబద్ధం చేశారు.
స్త్రీ శక్తిని పూజించడం వీరి నుంచే ప్రారంభమైంది. లింగ పూజ, అగ్ని పూజ, కోనేటి స్నానం వీరే ప్రారంభించారు.
దువ్వెనలు వాడటం, గాజులు ధరించడం వీరి నుంచి వచ్చినవే.
👉సింధూ నాగరికతకు చెందిన నగరాలు::
1) హరప్పా ను 1921 లో దయారాం సహాని కనుగొన్నారు.
2) మొహంజోదారో ను 1922 లో ఆర్.డి. బెనర్జీ కనుగొన్నారు.
3) చాన్హుదారో ను 1935 లో ఎం.జి. మజుందార్ కనుగొన్నారు.
4)కాళీభంగన్ ను 1953 లో ఎ.కె. ఘోష్ కనుగొన్నారు.
5)రూపర్ ను 1953 లో వై.డి. శర్మ కనుగొన్నారు.
6)లోథాల్ ను 1954 లో ఎస్.ఆర్. రావ్ కనుగొన్నారు.
7)రాఖీగర్హి ను 1963 లో కనుగొన్నారు
8) బన్వాలీ ను 1973 ఆర్.ఎన్. బిస్త్ కనుగొన్నారు.
9)దోలవీర ను 1991 లో ఘోష్ కనుగొన్నారు.

0 Comments