Science & technolgy

#AskWhy

స్లీపింగ్ పెరాలసిస్
============
*Knowledge hub groups* 
చాలా మంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు తమపై 'దయ్యం' పడిందని, గొంతునూ, శరీరాన్ని అదిమిపట్టడం వల్ల కాళ్ళూ చేతులూ ఆడలేదని, మాటరాలేదని అంటుంటారు. ఇది నిజమేనా??

చాలామందికి నిద్రలో ఇలాంటి అనుభవం అయ్యే ఉండవచ్చు. ఈ స్థితిని శాస్త్రీయంగా "స్లీపింగ్ పెరాలసిస్/hypnagogia". అంటారు. ఇది తెలుసుకోవాలనుకుంటే నిద్ర యొక్క దశలపై కొద్దిగా అవగాహన ఉండాలి. నిద్రలో ప్రధాన దశలు
1.మెలుకువ దశ (అలోచనల గజిబిజి దశ),
2.ట్రాన్స్ దశ (దాదాపుగ ఆలోచనల శూన్యం),
3.గాడనిద్ర దశ (శరీరం విశ్రాంతి దశ),
4.కలల దశ. 
ట్రాన్స్ దశలోని మనిషి శరీరం గాడనిద్ర దశకు ఆకర్శించబడుతుంది లేదా గుంజబడుతుంది. ఈ సంధి కాలంలో ఇక్కడే మనిషికి గట్టిగా శబ్దం గానీ, డిస్టబెన్స్ గానీ జరిగితే ట్రాన్స్ దశకు రివర్స్ గా కదిలి మెలకువ దశకు ప్రయత్నం జరుగుతుంది. మెలకువకు రావచ్చు. అయితే శరీరం విశ్రాంతి దశను గట్టిగా డిమాండ్ చేస్తూ సక్సెస్ అయితే మనిషి మెలుకువకు రాలేడు. ఆ సంధి దశలోనే శరీర సహకారం కోల్పోయి మాటరాక, శరీరం కదలక కొట్టుమిట్టాడుతాడు. ఇది కొన్ని సెకన్లు, నిమిషాలు కూడా ఉండవచ్చు. దీన్నే 'స్లీపింగ్ పెరాలసిస్' అంటారు. అంతే గానీ దయ్యం పట్టడం  కాదు......

#SleepParalysis

#ప్రశ్నించుశోధించు

Post a Comment

0 Comments