👌గ్రామ సచివాలయం ఉద్యోగాల అభ్యర్థుల కోసం:: 💐 *Important NOTE* ::గ్రామ సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన క్యాటగిరి - 1 లో ని నాలుగు రకాల ఉద్యోగాలకు ఈ క్రింద ఉన్న 3 చాప్టర్ లు చదివితే తక్కువ అంటే కూడా 25 నుంచి 30 మార్కులు తప్పకుండా పొందుతారు💐 👉73 వ రాజ్యాంగ సవరణ మరియు 74 వ రాజ్యాంగ సవరణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ చట్టం మరియు వ్యవస్థ.💐


👌గ్రామ సచివాలయం ఉద్యోగాల అభ్యర్థుల కోసం::

💐 *Important NOTE* ::గ్రామ సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన క్యాటగిరి - 1 లో ని నాలుగు రకాల ఉద్యోగాలకు ఈ క్రింద ఉన్న 3 చాప్టర్ లు చదివితే తక్కువ అంటే కూడా 25 నుంచి 30 మార్కులు తప్పకుండా పొందుతారు💐

👉73 వ రాజ్యాంగ సవరణ మరియు 74 వ రాజ్యాంగ సవరణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ చట్టం మరియు వ్యవస్థ.💐

🌺🌺🌺చాప్టర్. 1🌺🌺🌺

🙌 73 వ రాజ్యాంగ సవరణ విశ్లేషణ ::
73వ రాజ్యాంగ సవరణ బిల్లును పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు (1991లో) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ బిల్లుకు 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ఈ బిల్లుపై 1993 ఏప్రిల్ 20న సంతకం చేశారు. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. IXవ భాగంలో 243, 243 ‘A’ నుంచి 243 'O' వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపర్చారు. అలాగే 11వ షెడ్యూల్‌లో పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను కూడా చేర్చారు.

ప్రకరణ-243(A) గ్రామసభ ఏర్పాటు
ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ప్రతీకగా గ్రామ సభను ఏర్పాటుచేయాలి. ఇందులో గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామసభకు గ్రామ పంచాయతీ బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలు ఇవ్వడంలో గ్రామసభ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రకరణ-243(B) మూడంచెల పంచాయతీ వ్యవస్థ
ప్రతి రాష్ర్టంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. మొదటి అంచె.. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ; రెండో అంచె.. మధ్య (రెండో) స్థాయిలో మండల పరిషత్; మూడో అంచె.. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్.

ప్రకరణ-243(C) పంచాయతీ నిర్మాణం, ఎన్నికలు
1) రాష్ట్ర శాసన సభ నిర్ణయించిన చట్టాల మేరకు పంచాయతీ నిర్మాణం ఉంటుంది.
2) పంచాయతీలోని అన్ని స్థాయిల్లో ప్రతినిధులు నేరుగా ఓటర్లతో ఎన్నికవుతారు.
3) గ్రామ పంచాయతీ అధ్యక్షుడు/సర్పంచ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతి మేరకు ఎన్నికవుతాడు.

ప్రకరణ-243(D) పంచాయతీల్లో రిజర్వేషన్లు
రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు ఉంటాయి. మొత్తం స్థానాల్లో 1/3 వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు కేటగిరీ వారీగా 1/3 వంతు స్థానాలు రిజర్వు చేశారు.
ప్రత్యేక వివరణ: 110వ రాజ్యాంగ సవరణ బిల్లు-2009 ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు ఇంతవరకు ఆమోదం పొందలేదు. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. అవి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం మహిళలకు 1/3 వంతుకు తక్కువ కాకుండా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా అమలుచేయొచ్చు. అందువల్ల పైన పేర్కొన్న రాష్ట్రాల్లో రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే 50 శాతం రిజర్వేషన్లు చెల్లుబాటవుతాయి. రాజ్యాంగ సవరణ చేస్తే అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది.

ప్రకరణ-243(E) పంచాయతీల పదవీ కాలం
సాధారణంగా స్థానిక సంస్థల పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పదవీ కాలం పూర్తికాకముందే వాటిని రద్దు చేయొచ్చు. ఒక వేళ మధ్యలో రద్దయితే ఆరు నెలల్లోపు తిరిగి ఎన్నికలను పూర్తి చేయాలి. పంచాయతీ మిగిలిన కాలం ఆరు నెలల కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక అవసరం ఉండదు.

ప్రకరణ-243(F) పంచాయతీ సభ్యుల అనర్హతలు
పంచాయతీలకు ఎన్నికైన సభ్యులను కింది కారణాలపై అనర్హులుగా ప్రకటించొచ్చు. రాష్ట్ర శాసనసభలు రూపొందించిన అనర్హత చట్టాల మేరకు సభ్యత్వం రద్దవుతుంది.

నేరారోపణ రుజువైనప్పుడు..

కనీస వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు..

అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు.

పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ఏర్పరిచే అథారిటీకి అప్పీలు చేసుకోవాలి. ప్రస్తుతం సభ్యుల అనర్హత వివాదాలను విచారించే అధికారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జిల్లా కోర్టులకు ఉంది.

ప్రత్యేక వివరణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పంచాయతీ సభ్యుల అనర్హతకు ఒక ప్రత్యేక కారణాన్ని పొందుపరిచారు. 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే పోటీ చేయడానికి అనర్హులు. ఈ మధ్యనే(2015)లో రాజస్థాన్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతను నిర్ణయిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. 

ప్రకరణ-243(H) పంచాయతీలకు ఆదాయ వనరులు
ఎ) రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా పంచాయతీలకు కొన్ని పన్నులను విధించే అధికారాన్ని కల్పిస్తుంది.
బి) రాష్ర్ట ప్రభుత్వం కొన్ని పన్నులను వసూలు చేసి పంచాయతీలకు బదలాయిస్తుంది.
సి) రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ రూపంలో నిధులు ఇస్తుంది.
డి) పంచాయతీలకు సంబంధించిన నిధులను జమ చేయడానికి, ఖర్చు చేయడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయొచ్చు.

ప్రకరణ-243(I) రాష్ట్ర ఆర్థిక సంఘం
73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటుచేస్తారు. ఈ సంఘాన్ని గవర్నర్ ప్రతి ఐదేళ్లకు ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘంలో గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు. ఆర్థిక సంఘం ఇతర అంశాలను రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉన్నారు. ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు అందజేస్తుంది. గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసన సభ ముందు ఉంచుతారు.
ఆర్థిక సంఘం విధులు: రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు, ఇతర సుంకాలు, వసూలైన నికర ఆదాయంలో స్థానిక సంస్థలకు ఏవిధంగా బదిలీ చేయాలో ఆర్థిక సంఘం సూచిస్తుంది. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులు, డ్యూటీలు, సుంకాలను నిర్థారిస్తుంది. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సూచనలు చేస్తుంది. గవర్నర్ సూచించిన ఇతర అంశాలపై సలహాలు ఇస్తుంది.

ప్రకరణ-243(J) పంచాయతీల ఖాతాల ఆడిటింగ్
రాష్ట్ర శాసనసభ నిర్ణయం మేరకు ఖాతాలను నిర్వహించడానికి, వాటిని ఆడిట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయొచ్చు. 

ప్రకరణ-243(K) రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా వంటి అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఐదేళ్లు. ఇతర సర్వీసు విషయాలను రాష్ట్ర శాసనసభ చట్టాల మేరకు గవర్నర్ నిర్ణయిస్తారు. హైకోర్టు జడ్జీలను తొలగించే పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తారు.
విధులు: ఓటర్ల జాబితాను రూపొందించడం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను గవర్నర్ అనుమతితో సమకూర్చుకోవడం. ఎన్నికల వివాదాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం.

ప్రకరణ-243(L) కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువర్తన
73వ రాజ్యాంగ సవరణలోని అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకూ అనువర్తిస్తారు. శాసనసభలు గల కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి తీర్మానాల మేరకు వీటిని అనువర్తింప జేసుకుంటాయి (లేదా) రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా కొన్ని మార్పులతో ఈ అంశాలను కేంద్ర పాలిత ప్రాంతాలకు అనువర్తింప జేస్తారు.

ప్రకరణ-243(M) మినహాయింపులు
73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న అంశాల నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. ప్రకరణ-243(M)(1) ప్రకారం ఈ అంశాలు ప్రకరణ 244లో పేర్కొన్న షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తించవు. ప్రకరణ-243(2) ప్రకారం మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు; మణిపూర్‌లోని స్వతంత్ర జిల్లా కౌన్సిళ్లకు; పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతాలకు ఈ అంశాలు వర్తించవు.
ప్రత్యేక వివరణ: ప్రకరణ-243M(3A) ప్రకారం అరుణాచల్‌ప్రదేశ్ స్థానిక సంస్థల్లో షెడ్యూల్డు కులాలకు రిజర్వేషన్లు వర్తించవు. ఇది ప్రకరణ-243(D)కి మినహాయింపు. ఈ అంశాన్ని 2000 సంవత్సరంలో 83వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో షెడ్యూల్డు కులాలు గుర్తించదగిన సంఖ్యలో లేవు.

ప్రకరణ-243(N) అప్పటికే ఉన్న పంచాయతీ చట్టాల కొనసాగింపు 
73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏడాది వరకు ఆ రాష్ట్రాల్లో ఉన్న పాత పంచాయతీ చట్టాలనే కొనసాగించొచ్చు. ఏడాది తర్వాత ఆ రాష్ట్రాలు నూతన పంచాయతీ చట్టాలను ఆమోదించి అమలుచేయాలి.

ప్రకరణ-243(O) ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుంచి మినహాయింపు
పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ మొదలైన అంశాలను న్యాయస్థానాల జోక్యం నుంచి మినహాయించారు. అయితే ఎన్నికల పిటిషన్ ద్వారా రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతిలో నిర్ణీత న్యాయ వ్యవస్థ ముందు ఎన్నికల వివాదాలను ప్రశ్నించవచ్చు.

👉నూతన పంచాయతీ వ్యవస్థ ముఖ్య లక్షణాలు:
73వ రాజ్యాంగ సవరణలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. మొదట ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పంచాయతీ వ్యవస్థను ఏర్పాటుచేయాలనే అంశాన్ని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు విధిగా నిర్వహించాల్సిన అంశాలను పేర్కొన్నారు. కొన్ని అంశాలను ఆ రాష్ట్ర శాసనసభల ఐచ్ఛికానికి వదిలేశారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన అంశాలు (దేశంలో ఏకరూపత ఉన్న అంశాలు)

మూడంచెల విధానం కొనసాగింపు

👉గ్రామ సభల ఏర్పాటు:

పంచాయతీ అధ్యక్షుడి (సర్పంచ్) ఎన్నికలు ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతిలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఉంటాయి.
ఉదా: సర్పంచ్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రత్యక్షంగా ఉంది. కర్ణాటకలో పరోక్షంగా ఉంది.

స్థానిక సంస్థల్లో అన్ని స్థాయిల్లోనూ ప్రతినిధులు (వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.

మధ్య స్థాయి, జిల్లా స్థాయిలోని అధిపతులు పరోక్షంగా ఎన్నికవుతారు.

షెడ్యూల్డు కులాలు, తెగల వారి జనాభా మేరకు రిజర్వేషన్లు వర్తింపజేయడం.

మహిళలకు అన్ని స్థాయిల్లో 1/3వ వంతు తగ్గకుండా రిజర్వేషన్లను ఇవ్వడం.

ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘాన్ని నియమించడం వనరుల బదిలీ కోసం రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేయడం ప్రతి ఐదేళ్లకు ఒక సారి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం.

ఐచ్ఛిక అంశాలు: కింది అంశాలను రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు వదిలేశారు.

వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం.

11వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధుల బదలాయింపు.

స్థానిక సంస్థల సభ్యుల అనర్హతకు సంబంధించిన అంశాలు, ఇతర షరతులు.

పంచాయతీ వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించడం.

పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు పంచాయతీలో ఓటు హక్కులు కల్పించడం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ-కమిటీల సిఫార్సులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పంచాయతీ సమితిని 1959, అక్టోబర్ 11న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌లో ప్రారంభించారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది.

🌺🌺🌺చాప్టర్. 2🌺🌺🌺

🙌74 రాజ్యాంగ సవరణ విశ్లేషణ ::
👉పట్టణ స్థానిక ప్రభుత్వాలు
1. మున్సిపల్ కార్పొరేషన్ 
2. నోటిఫైడ్ ఏరియా కమిటీ
3. కంటోన్మెంట్ బోర్డు
4. పోర్ట్ ట్రస్ట్ 
5. మున్సిపాలిటీ
6. టౌన్ ఏరియా కమిటీ 
7. టౌన్‌షిప్
8. ప్రత్యేక ప్రయోజన సంస్థలు

దేశంలో తొలిసారిగా 1687లో మద్రాస్‌లో మున్సిపల్ కార్పొరేషన్‌ను బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు. 1726లో బాంబే, కలకత్తా కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 1993, జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది.

👉74వ రాజ్యాంగ సవరణ:
పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో "IXA’ భాగంలో ప్రకరణ 243P నుంచి 243ZG వరకు పొందుపరిచారు.

మున్సిపాలిటీ: 243Q ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థ.

పంచాయతీ: 243B ప్రకరణ కింద పంచాయతీగా ఏర్పడిన ప్రాంతం.

జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి, నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.

243Q మున్సిపాలిటీల నిర్మాణం గురించి తెలుపుతోంది.

గామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు.

చిన్న పట్టణాల్లో మున్సిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.

పట్టణంగా పరివర్తన చెందుతున్న ప్రాంతం, చిన్న పట్టణం, పెద్ద పట్టణం వంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ సరైన అర్థ వివరణ ఇస్తారు.

👉మున్సిపాలిటీ ఎన్నికలు :
ప్రకరణ 243R మున్సిపాలిటీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలియజేస్తోంది.

మున్సిపాలిటీ సభ్యులను (అన్ని స్థాయిల్లో) ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

మున్సిపాలిటీ సభ్యుల కూర్పు, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రూపొందిస్తుంది.

నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అధ్యక్షుల ఎన్నిక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నిర్ణయించిన మేరకు ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు హోదా రీత్యా సభ్యులుగా కొనసాగుతారు.

👉వార్డు కమిటీలు:

ప్రకరణ 243 ప్రకారం 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్డులను కలిపి వార్డు కమిటీలను ఏర్పాటు చేయొచ్చు.

వార్డు కమిటీ ఏర్పడినప్పుడు సంబంధిత వార్డు ప్రతినిధిని ఆ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులతో వార్డు కమిటీ ఏర్పాటు చేస్తే ఆయా వార్డుల ప్రతినిధులు తమలో ఒకర్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.

కార్పొరేషన్‌లో వార్డు కమిటీల సంఖ్య 50కి తగ్గకుండా, 100కి మించకుండా ఉండాలి.

👉రిజర్వేషన్స్: 
ప్రకరణ 243T రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది.

ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్‌‌వ చేయాలి.

మొత్తం స్థానాల్లో కనీసం 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్‌‌వ చేయాలి.

రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించాలి.

రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని కలిగి ఉంది.

👉పదవీ కాలం, అనర్హతలు :
ప్రకరణ 243U పదవీ కాలం గురించి తెలుపుతోంది. అన్ని స్థాయిల్లోని సభ్యులు, అధ్యక్షుల పదవీకాల పరిమితి ఐదేళ్లు. ప్రకరణ 243V అనర్హతల గురించి పేర్కొంటోంది.

పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్ని స్థాయిల్లోఅధ్యక్ష, సభ్యుల అర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణశాఖకు ఉంటుంది.

పార్లమెంటుకు, అసెంబ్లీలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హత, అనర్హత నిబంధనలే స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కూడా వర్తిస్తాయి.

స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కనీసం 21 ఏళ్లు ఉండాలి.

1995 సంవత్సరం తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగుంటే పోటీకి అనర్హులు.

👉అధికార విధులు:

ప్రకరణ 243గి అధికార విధుల గురించి వివరిస్తోంది.

12వ షెడ్యూల్‌లో 18 విధులను పట్టణ స్థానిక సంస్థల కు నిర్దేశించారు. వీటిని రాష్ట్ర ప్రభు త్వాలు బదిలీ చేస్తాయి. పన్నెండో షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధుల వివరాలు..
1. నగర ప్రణాళిక
2. సమర్ధవంత భూ వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణ
3. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
4. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి
5. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ
6. రహదారులు, వంతెనలు
7. ప్రజారోగ్యం, మురుగు నీటిపారుదల, చెత్త నియంత్రణ
8. అగ్నిమాపక వ్యవస్థ
9. పరిశ్రమలకు, గృహాలకు నీటి వసతి
10. బలహీన వర్గాల సంరక్షణ, వికలాంగులకు వసతి.
11. వీధి దీపాలు, బస్టాండుల నిర్వహణ
12. కబేళాలపై నియంత్రణ
13. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
14. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు
15. జంతువుల సంరక్షణ
16. ఆట స్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ
17. శ్మశాన వాటికల నిర్వహణ
18. జనన, మరణాల నమోదు

👉ఆదాయ వనరులు, హక్కులు:
ప్రకరణ 243X ప్రకారం స్థానిక సంస్థలు తమ ఆదాయం కోసం శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులు విధించడం, వసూలు చేయడం చేయవచ్చు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయ నిధులు అందిస్తాయి.
ప్రకరణ 243Y ప్రకారం ఫైనాన్స్ కమిషన్

73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న ప్రకరణ 243ఐలోని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ పట్టణ స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.

ప్రకరణ 243Z ప్రకారం అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్

పట్టణ, నగర కార్పొరేషన్ సంస్థల అకౌంట్‌లను పరిశీలించేందుకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చు.

ప్రకరణ 243ZA ప్రకారం మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ

పకరణ 243ఓలో ప్రస్తావించిన విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.

ప్రకరణ 243ZB ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు

74వ రాజ్యాంగ సవరణలోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. పార్లమెంటు చట్టం ద్వారా వీటిని వర్తింప చేస్తుంది.

ప్రకరణ 243ZC ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపులో మినహాయింపులు

244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలు, 244(2) ప్రకారం షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ఈ విభాగం వర్తించదు.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని కొండ ప్రాంతాలకు ఏర్పాటు చేసినగూర్ఖాహిల్ కౌన్సిల్‌కు ఈ విభాగం వర్తించదు.

ప్రకరణ 244(1), 244(2) ప్రకారం షెడ్యూల్డ్, ఆదివాసీ ప్రాంతాలకు ఈ విభాగాన్ని వర్తింపచేస్తూ పార్లమెంట్ శాసనాలను రూపొందించవచ్చు. అయితే వాటిని రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు.

ప్రకరణ 243ZD ప్రకారం జిల్లా ప్రణాళికా కమిటీ

👉పతి రాష్ట్రంలో జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ పంచాయతీ, మున్సిపాలిటీలు రూపొందించిన ప్రణాళికలను సమీకరించి తుది ప్రణాళికలను రూపొందిస్తుంది. జిల్లా ప్రణాళిక కమిటీ నిర్మాణాన్ని రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

గమనిక: జిల్లా ప్రణాళిక కమిటీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి వర్తించదు. 
ప్రకరణ 243ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ

10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణం, విధులు వంటి అంశాలను రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. నగర మేయర్ ఈ కమిటీకి చైర్మన్‌గా, మున్సిపల్ కమిషనర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దీంతోపాటు కమిటీలో మున్సిపల్ పాలనలో అనుభవమున్న నలుగురు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులను గ్రామ పంచాయతీ అధ్యక్షులు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రతినిధులు ఎన్నుకుంటారు.

ప్రకరణ 243ZF ప్రకారం పాత శాసనాల కొనసాగింపు

74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న పాత చట్టాలే కొనసాగుతాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను అనువర్తింప చేసుకోవాలి.

👉పట్టణ స్థానిక సంస్థలు - నిర్మాణం
1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 
మొదటి అంచె - నగర పంచాయతీ
రెండో అంచె - పురపాలక సంస్థలు
మూడో అంచె - నగరపాలక సంస్థలు

👉నగర పంచాయితీ:
గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు 20,000 నుంచి 40,000 వరకు జనాభా గల చిన్న పట్టణ ప్రాంతాలకు నగర పంచాయతీ హోదా కల్పిస్తారు. నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఓటర్లతో ఒక సభ్యుడు నేరుగా ఎన్నికవుతారు. ప్రతి నగర పంచాయతీలో గరిష్టంగా 10 మంది ఎన్నికైన వార్డు సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.

నగర పంచాయతీలో నివాసముంటున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హోదా రీత్యా సభ్యులుగా ఉంటారు.

నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకర్ని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు.

సర్పంచ్, ఉప సర్పంచ్‌లను తొలగించినట్లే వీరిని కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.

👉పురపాలక సంస్థలు:
1965లో సమగ్ర పురపాలక సంస్థల చట్టం ప్రకారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త చట్టాన్ని రూపొందించింది. 40,000 నుంచి 3,00,000 జనాభా ఉన్న పట్టణాల్లో పురపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు. వార్షికాదాయ, పరిమాణాల ఆధారంగా పురపాలక సంస్థలను ఐదు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం: వార్షిక ఆదాయం రూ.8 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవి.
2. స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉన్నవి.
3. గ్రేడ్-1 పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య ఉన్నవి. 
4. గ్రేడ్-2 పురపాలక సంఘం: వార్షికాదాయం రూ.2 కోట్లు నుంచి రూ.4 కోట్ల మధ్య ఉన్నవి.
5. గ్రేడ్-3 పురపాలక సంఘం: వార్షికాదాయం కోటి రూపాయల నుంచి రూ.రెండు కోట్లలోపు ఉన్నవి.
సూచన: ఈ వర్గీకరణను ప్రభుత్వం కాలానుగుణంగా మార్చవచ్చు.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. అవి..
👉పురపాలక మండలి: పురపాలక సంస్థ చర్చా వేదికే పురపాలక మండలి. ఇందులో ఎన్నికైన సభ్యులు. కోఆప్టెడ్ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉంటారు.
👉మున్సిపల్ కౌన్సిలర్లు: వీరిని ఓటర్లు వార్డు ప్రాతిపదికన ఎన్నుకుంటారు. జనాభాను బట్టి వీరి సంఖ్యను నిర్ణయిస్తారు.

40 వేల వరకు జనాభా ఉంటే 21 మంది కౌన్సిలర్లు ఉంటారు.

👉జనాభా 40 వేల నుంచి లక్ష వరకు ఉంటే 21 మంది సభ్యులు, ప్రతి 10 వేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటారు.

👉జనాభా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటే 27 మంది సభ్యులు, ప్రతి 15 వేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటారు.

👉జనాభా రెండు లక్షల మించి ఉంటే 33 మంది సభ్యులు, ప్రతి 20 వేల అదనపు జనాభాకు ఒక అదనపు సభ్యుడు ఉండవచ్చు. గరిష్టంగా 45 సభ్యులకు మించరాదు

🌺🌺🌺చాప్టర్. 3🌺🌺🌺

🙌 ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం

👉ఆంధ్రప్రదేశ్ లో నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం-1994 ప్రకారం మూడంచెల విధానం అమల్లో ఉంది.

1)మొదటి అంచె:గ్రామపంచాయతీ.
ఇది గ్రామస్థాయిలో ఉంటుంది.

2)రెండో అంచె: మండల పరిషత్తు.
ఇది మండల స్థాయిలో ఉంటుంది.

3)మూడో అంచె: జిల్లా పరిషత్తు.
ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది.

#విశ్లేషణ ::

1)గ్రామ పంచాయతీ నిర్మాణం ::

👉గ్రామ పంచాయతీ అనేది మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు .. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా జనాభా 300 మందికి తగ్గకుండా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు.
గ్రామ పంచాయతీ నిర్మాణం కింది విధంగా ఉంటుంది.

గ్రామ సభ
వార్డు సభ్యులు
కో ఆప్టెడ్ సభ్యులు
శాశ్వత ఆహ్వానితులు
సర్పంచ్
ఉప సర్పంచ్
పంచాయతీ కార్యనిర్వహణాధికారి/ సెక్రటరీ లతో నిండి ఉంటుంది. 

👉 గ్రామసభ: గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు.
ప్రతి పంచాయతీలో గ్రామ సభ ఉంటుంది.
గ్రామంలో ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు.
గ్రామ సభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు.
ప్రతి ఏటా ఏప్రిల్ 14న, అక్టోబర్ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు.
ఓటర్లందరూ సభ్యులే. సమావేశానికి కోరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అభీష్టానికి వదిలేశారు. కొన్ని రాష్ట్రాల్లో కోరం నిర్ణయించారు.
ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం ప్రజలు కోరితే గ్రామ సభ సమావేశం నిర్వహించాలి.
గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.

👉గ్రామ సభ విధులు:

గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన, ఆడిట్ నివేదికలను ఆమోదించడం.
గ్రామ పంచాయతీ అభివృద్ధి; కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు.
బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం.
పన్ను బకాయిదారుల జాబితా రూపొందించడం.
సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం, అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.

👉 వార్డు సభ్యులు/ పంచాయతీ సభ్యులు
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. వీరిని ఓటర్లు ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీలు లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిసి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది.
300 వరకు జనాభా ఉంటే 5 వార్డులు
300-500 వరకు 7 వార్డులు
500-1500 వరకు 9 వార్డులు
1500-3000 వరకు 11 వార్డులు
3000-5000 వరకు 13 వార్డులు
5000-10,000 వరకు 15 వార్డులు
10,000-15,000 వరకు 17 వార్డులు
15,000 పైన 19 నుంచి 21 వార్డులు

👉కోఆప్టెడ్ సభ్యులు:
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.

👉శాశ్వత ఆహ్వానితులు:
మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎం.పి.టి.సి) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.

👉గ్రామ పంచాయతీ సమావేశం - కోరం:
సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు.
90 రోజుల లోపల తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు.
సర్పంచ్ 90 రోజుల లోపల తిరిగి సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే పంచాయతీ కార్యదర్శే స్వయంగా సమావేశం ఏర్పాటు చేయొచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యులను 1/3 వంతు సభ్యులుగా నిర్ణయించారు. అయితే కోరం లేకపోయినా సమావేశం నిర్వహించవచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు.
గ్రామ పంచాయతీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు & ఎం.పి.టి.సి. సభ్యులు & గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు & మండల పరిషత్తు కోఆప్టెడ్ సభ్యుడు.

👉 గ్రామ సర్పంచ్:
సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు.
గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.
గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు.
సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు.
ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపల ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

👉సర్పంచ్ విధులు:
పంచాయతీ, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది.
ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.
ఉప సర్పంచ్ పదవిలో ఖాళీ ఏర్పడితే 30 రోజుల లోపల ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు.
గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయవచ్చు.
గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు.
గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుధ్య కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు.

👉ఉప సర్పంచ్:
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నికవ్వాలంటే వార్డు సభ్యులై ఉండాలి.
ఉప సర్పంచ్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించొచ్చు. అయితే ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిన నాలుగేళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు: ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు.

👉అవిశ్వాస తీర్మానం:ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టరాదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉపసర్పంచ్‌ను తొలగిస్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమ యంలో ఓటు హక్కు ఉంటుంది.
👉అధికారాలు:సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.

👉👌2)మండల పరిషత్::

మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల పరిషత్ మధ్యస్థ అంచె. 1986లో ఎన్టీరామారావు హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 330 పంచాయతీ సమితిల స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌లో సుమారు 15 నుంచి 18 గ్రామ పంచాయతీలు, 35 వేల నుంచి 55 వేల జనాభా ఉంటుంది. మండల పంచాయతీని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. గుజరాత్, కర్ణాటకల్లో తాలుకా పంచాయతీ అని, మధ్యప్రదేశ్‌లో జన్‌పథ్ పంచాయతీ, తమిళనాడులో పంచాయతీ సంఘం, అరుణాచల్ ప్రదేశ్‌లో అంచల్ కమిటీ, ఉత్తరప్రదేశ్‌లో క్షేత్ర పంచాయతీ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మండల పరిషత్ అని వ్యవహరిస్తారు.

👉మండల పరిషత్‌లోని సభ్యులు ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఓటర్లతో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు(ఎంపీటీసీ).
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఎమ్మెల్సీ, రాజ్యసభ మెంబర్ సభ్యులుగా ఉంటారు.
ఎంపీటీసీ సభ్యులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ఒకరిని కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకుంటారు.
మండల పరిషత్ సమావేశాలకు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. వీరికి ఓటు హక్కు ఉండదు.
3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రాదేశిక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు.
ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు.
కలెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు మండల పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు. వీరికి ఓటు వేసే అధికారం లేదు.
ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థను 1986 జూన్‌లో ఏర్పాటు చేశారు.
1987 జనవరి 7న నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

👉విధులు:
గ్రామ పంచాయతీ, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో మండల పరిషత్ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం విత్తనాలు, ఎరువుల సరఫరా, నీటి సౌకర్యం కల్పించి బీడు భూములను సాగులోకి తేవడం, అడవుల పెంపకం, పశుగణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణ, ప్రసూతి కేంద్రాలు, టీకాలు, అంటు రోగాల నివారణ, ప్రాథమిక విద్యా సౌకర్యాల కల్పన, పర్యవేక్షణ. 
ఆర్థిక వనరులు
భూమి శిస్తు, రాష్ట్రం విధించే పన్నులు, ఫీజుల నుంచి వచ్చే వాటా.
సామాజిక అభివృద్ధికి సంబంధించిన నిధులు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, అఖిల భారత సంస్థలు ఇచ్చే గ్రాంట్లు.
మండల పరిషత్ విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం
దాతలు ఇచ్చే విరాళాలు
మండల పరిషత్ కార్యనిర్వహణాధికారిగా మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీవో)ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

👉👌3) జిల్లా పరిషత్

జిల్లా పరిషత్‌ను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 9 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు.

👉జిల్లా పరిషత్‌లోని సభ్యులు
ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ఓటర్లతో ఎన్నికైన సభ్యులు (జెడ్పీటీసీలు)
జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు.
అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు.
జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
ప్రతి జిల్లా పరిషత్‌లో జిల్లా మహాసభ ఉంటుంది. ఇందులో జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతడు జిల్లా పరిషత్‌కు పాలనా పరమైన అధికారిగా విధులు నిర్వహిస్తాడు.

👉జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు:
1. ప్రణాళికా, ఆర్థిక స్టాండింగ్ కమిటీ
2. గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ
3. వ్యవసాయ స్టాండింగ్ కమిటీ
4. విద్య, వైద్య సేవల స్టాండింగ్ కమిటీ
5. స్త్రీ, సంక్షేమ స్టాండింగ్ కమిటీ
6. సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ
7. పన్నుల స్టాండింగ్ కమిటీ
ప్రతి స్థాయి కమిటీలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవీరీత్యా సభ్యుడిగా ఉంటాడు. కానీ అతడికి ఓటు వేసే అధికారం ఉండదు. ఇతర సభ్యులను నామినేట్ చేస్తాడు.
జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు జిల్లా కలెక్టర్ హాజరు కావొచ్చు. కానీ ఓటు హక్కు ఉండదు.

👉జిల్లా పరిషత్ విధులు:
జిల్లా పరిషత్ జిల్లాలోని మండల పరిషత్‌ల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అమలు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల ఆర్థిక విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమయ్యే గణాంక సమాచారాన్ని అందిస్తుంది.
జిల్లాలో సెకండరీ పాఠశాలలు, వృత్తి విద్యా పాఠశాలలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది.
జిల్లాలో వైద్య సౌకర్యాల నిర్వహణ.

👉ఆర్థిక వనరులు:
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు. 
2. అఖిల భారత సంస్థలు అందించే గ్రాంట్లు
3. భూమి పన్ను.
4. ఎండోమెంట్స్,ట్రస్టుల ద్వారా వచ్చే ఆదాయం.
5. ఫీజులు.
6. ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలు.
7. మండల పరిషత్‌ల నుంచి వచ్చే కంట్రిబ్యూషన్లు.
8. లాభసాటి సంస్థల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం.
243 (జె) అధికరణం ద్వారా పంచాయతీల ఖర్చులను రికార్డ్ చేయడం. ఆడిటింగ్‌కు సంబంధించి తగిన శాసనాన్ని శాసనసభ చేయాలి.
243 (జెడ్‌డీ) అధికరణం ప్రకారం జిల్లా ప్రణాళికా అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి.

👉ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రదేశాల్లో పంచాయతీరాజ్ విధానం అమలు కోసం 1994లో ‘దిలీప్‌సింగ్ బురియా’ కమిటీని ఏర్పాటు చేశారు.

👉దిలీప్‌సింగ్ బురియా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం 1996 డిసెంబర్ 24న ఆమోదించింది.
ఈ కమిటీ ప్రతిపాదించిన మూడంచెలు
1. గ్రామసభ
2. గ్రామ పంచాయతీ
3. పంచాయతీ సమితి/ తాలుకా పంచాయతీ

💐💐💐💐💐 ముగింపు💐💐💐💐💐
                               www.storeknowledge.in🌍

Post a Comment

0 Comments