*🌕 చంద్రయాన్-2: జాబిల్లి కక్ష్యలోకి..*
〰〰〰〰〰〰〰〰
ఇంటర్నెట్ డెస్క్:
యావత్తు దేశం ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టం విజయవంతమైంది. ప్రయోగించిన 29 రోజుల తర్వాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం 9.02 గంటలకు ఈ క్రతువును ప్రారంభించి 1738 సెకన్ల పాటు కొనసాగించారు. ‘మేక్ ఆర్ బ్రేక్’గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్‌ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఓరియెంటేషన్ ప్రక్రియతో పాటు చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించి దాని దశ దిశ మార్చారు. దీంతో ఉపగ్రహం చంద్రుడి 114కి.మీ x 18072 కి.మీ కక్ష్యలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను మండించడం ద్వారా చేపట్టారు.
ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న చంద్రయాన్-2పై మరో నాలుగు విన్యాసాలు చేపట్టనున్నారు. ఆగస్టు 21, 28, 30న చేపట్టే ఈ ప్రయోగాల ద్వారా చంద్రయాన్-2 జాబిల్లికి చేరువగా ఉండే చివరి కక్ష్యలోకి చేరుకుంటుంది.
100×100 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలో అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టారు. చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రభావం 65 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ లోపల ఉండే వస్తువును చంద్రుడు తన వద్దకు చేర్చుకునే వీలుంది. ఆగస్టు 20వ తేదీ (మంగళవారం) చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యకు 150 కిలోమీటర్ల దూరానికి చేరనుంది. ఈ సమయంలో శాస్త్రవేత్తలు రీఓరియంటేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు రెండో తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు. ఫలితంగా ల్యాండర్ మృదువుగా ల్యాండింగ్ కానుంది. సెప్టెంబరు 7వ తేదీ వేకువజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో సాఫీగా ల్యాండింగ్ చేయనుంది. ఆర్బిటర్, ల్యాండర్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు ల్యాండింగ్ ప్రాంతాన్ని రియల్ టైమ్‌లో చిత్రాలను తీసి పంపనున్నాయి. ల్యాండర్ కింద ఉండే కెమెరాలు ల్యాండింగ్ స్థలాన్ని అధ్యయనం చేసి అక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే ల్యాండ్ చేస్తాయి. ల్యాండర్ దిగిన తర్వాత అందులోని ఆరుచక్రాల రోవర్ దాదాపు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తుంది. ఇది సెకనుకు సెంటీమీటరు వేగంతో పయనిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం చంద్రునిపై పయనించనుంది. అది అక్కడ తీసిన డేటా మొత్తాన్ని ల్యాండర్ ద్వారా 15 నిమిషాల్లో భూమిపై చేరవేయనుంది. 🙋♂

0 Comments