వృత్తములు
అక్షర సంఖ్య చేగాని అక్షర గణములచే గాని నియతములగు పాదములు గల పద్యమునకు ఛందశ్శాస్త్రమున వృత్తమని వ్యవహరిస్తారు.
ఈ వృత్తములు ఉక్తాదులగు ఇరువది ఆరు ఛందములందు నిష్పన్నములగును.
గాయత్ర్యాది ఛందములందు వర్తించుట వలన ఇవి వృత్తమలని వ్యుత్పత్తి.
ఇరవై అరు అక్షరాల కు మించి ఉన్న పద్యాలను ఉద్దుర మాలా పద్యమలని వ్యవహరిస్తారు.
*ఛందస్సుల పేర్లు*
ఏక సంఖ్యా మానం పై ఆధారపడి 26 వరకు సాగుతాయి.
పాదానికి 1 అక్షరం మాత్రమే ఉంటే
1 . ఉక్త
రెండు అక్షరాలు ఉంటే
2. అత్యుక్త
3.మధ్య
4. ప్రతిష్ఠ
5 సుప్రతిష్ఠ
6 గాయత్రి
7. ఉష్ణికి
8 అనుష్టుప్
9 బృహతీ
10 పంక్తి
11 త్రిష్టుప్
12 జగతీ
13 అతి జగతీ
14 శక్వరి
15 అతి శక్వరి
16 అష్టి
17 అత్యష్టి
18 ధృతి
19 అతి ధృతి
20 కృతి
21 ప్రకృతి
22 ఆకృతి
23 వికృతి
24 సంకృతి
25 అభికృతి
26 ఉత్కృతి.
ఈ 26 అక్షరాలకు మించిన వృత్తాలను
ఉద్దుర మాలా పద్యమలని వ్యవహరిస్తారు.
ఉద్దుర అంటే బరువైన ,నిండి పోయినది అని అర్థం.
అవి:
1. లయగ్రాహి
2. లయవిభాతి
3. లయహారి
4. త్రిభంగి
ఇవి కాక
మరికొన్ని ఉన్నాయి.
1. లాక్షణి
2. రమణక
3. దర
4. లలిత -2
5. ఘన నిసద
6. శాలూర
పై వాటికి లక్షణ గ్రంధాలలో లక్ష్యాలను చూసి సమన్వయం చేసుకొనండి.
✍️పైడి నాగ సుబ్బయ్య.
0 Comments