ఆంధ్ర వ్యావహారిక భాషలో ఉర్దూ పదాలు - (1వ భాగం) అజమాయిషి (ఆజ్ మాఇష్), యకాయకీ(యకాయక్), కసాయి (కసాబు), కుమ్మక్కు (కుమక్), కులాసా(ఖులాసా), కుల్లాయి (ఖులాహా)

ఆంధ్ర వ్యావహారిక భాషలో ఉర్దూ పదాలు - (1వ భాగం)



అజమాయిషి (ఆజ్ మాఇష్), యకాయకీ(యకాయక్), కసాయి (కసాబు), కుమ్మక్కు (కుమక్),
కులాసా(ఖులాసా), కుల్లాయి (ఖులాహా), కూపీ (ఖుఫియా), కైపు (కైఫ్ ), ఖాతరు (ఖాతిర్ ), గంజాయి (గాంజా ), గచ్చు ( గచ్-పారసీ), గర్జు (గరజ్), గలభా ( గల్ బా), గలీబు (గిలాఫ్), గసగసాలు (ఖస్ ఖస్), గాభరా (ఘబ్ రాహట్), గిలాబా ( గిలావా), చలాకీ ( చాలాక్ ), చిరునామా (సర్ నామా), చీటి (చిట్టీ), చెకుముకి ( చఖ్ మఖ్), జగడం (ఝగడ్ నా), జంపఖానా (ఝాంప్ నా ), జాగా (జగహ్ ), జాస్తి (జ్యాదతి), జీను (జీన్ ), జులపాలు (జుల్ఫ్), జులాయీ (జులాహా), జులుం (జుల్మ్),జోరు (జోర్ ), తగాదా (తకాజా), తనిఖీ (తనక్కి), తయారు ( తయ్యార్), తరఫు (తరఫ్), తరహా (తరహ్ ), తర్ఫీదు (తర బీయత్), తాపీగా (తాబ్), తాయెత్తు (తావీజు ), తాలూకు (తా అల్లుక్), తాహతు (తాకత్ ), తురాయి (తుర్రహ్ ), త్రాసు (తరాజు), దరఖాస్తు (దర్ ఖ్వాస్త్), దర్యాప్తు(దర్ యాఫ్త్), దళారి (దలాల్), దాఖలా(దాఖిలా), దాణా(దానా), దాల్చిన చెక్క(దార్ చీన్), దినుసు(జిన్స్, బహు వచనం-అజినాశ్), దివాలా(దివాలియా), దుకాణం (దుకాన్), దుశ్శాలువా(దో శాలా), నగదు(నకద్), నాగా(నాకా), నగిషీ(నక్ష్), నమోదు(నమూద్), నాజూకు(నాజుక్), నామోషి(నాముషీ), నిషా(నషా), పకోడి (పకౌడా), పచారి(పన్ సార్), పరకామణి(పరఖ్ నా), పరాయి(పరాయా), పలావు(పులావు), పుదీనా(పోదీనా), పునాది(బునియాద్), పేచీ(పేచ్-చిక్కు), పైజామా(పాయ్ జామా), పొట్లం(పోట్లీ-మూట), ఫరవా(పర్ వా), ఫిర్యాదు(ఫర్ యాద్), బజారు(బాజార్), బకాయీ(బకాయా), బట్వాడా(బట్వారా), బయానా(బేయానా), బాతు(బతక్), బాపతు(బాబత్), బాబు/బాబోయ్(బాప్), బికారి(బిఖారి), బిచాణా(బిఛానా), బినామీ(బేనామీ), బుటా(బూటా), బురుజు(బుర్జ్), భజంత్రీ(బజంత్రి), భీమా(బీమా), భేటీ(భేంట్), మకాం(ముకాం), మజాకా(మజాఖ్), మజూరీ(మజ దూరీ), మద్దతు(మదద్), మలాము(ములమ్మా), మసాలా(మసాలహ్), మాఫీ(ము ఆఫ్), ముక్తసరి(ముఖ్త సర్), మునసబు(మున్సిఫ్), మేడు(మేఖ్), మోస్తరు(మాస్రా), రంగేళి(రంగీలా), రద్దు(రద్ద్), రాయితీ(రి ఆయతీ), రుజువు(రుజూ), రైతు(రయ్యత్), లంగా(లహెంగా), లాలూచీ(లాలచ్), లావాదేవీ(లానా ఔర్ దేనా), లూటీ(లూట్ నా), వగైరా(వగైరహ్), వాకబు(వాకిఫ్), వాయిదా(వాదా), వారసుడు(వారిస్), షరా(శరహ్), షోకు(షౌక్), సంజాయిషీ(సమ్ ఝాయిషీ), సజ్జ(సబ్జా), సజావు(సుఝావ్), సదరు(సదరహ్), సబబు(సబబ్), సబురు(సఫర్), సబ్బు(సాబున్), సరంగు(సర్ హంగ్), సరంజామా(సర్ అంజామ్), సరఫరా(సర్ బరాహి ), సలహా(సలాహ్ ), సాలీనా(సాలానా), సిఫార్సు(సిఫారిష్), సిబ్బంది(సఫ్ బంది), హక్కు(హక్), హమామ్(హమ్మామ్-స్నానశాల), హయాం(అయ్యామ్), హుషారు(హోషియారీ).

ఆంధ్ర వ్యావహారిక భాషలో ఉర్దూ పదాలు - (2వ భాగం)

అంబారీ, అఖాడీ, అమలు,అరకు, అర్జీ , అల్మారా(రీ), ఆయా, ఆలు(గడ్డ), ఆవార, ఆసరా, ఆసామి, ఇలాకా,ఇస్త్రీ, ఉల్టా, ఊదా,కదం, కబేళా, కమాను, కబ్జా, కమ్చీ,కలం, కలంకారీ, కళాయి,కవాతు,కసరత్తు, కార్ఖానా, కిరాణా, కిస్ మిస్, కుర్చీ, కుర్తా,కూజా, కైఫియత్తు, కౌలు,ఖజానా, ఖబర్దార్, ఖరాబు, ఖరీదు, ఖరీఫ్,(వర్షాకాలపు పంట),ఖర్చు, ఖాకీ, ఖామందు, ఖాయం, ఖాళీ, ఖాసా(వ్యక్తిగత సేవకుడు),ఖూనీ కోరు, గమ్మత్తు, గాగ్రా,గుత్తా, గులాబీ, గోదాం,ఘరానా, ఘాట్, చందా, చపాతీ, చోరీ,జుబ్బా, జుర్మానా,జేబు, జోష్, ఝలక్, టోకు, టోపీ, ఠికానా, డీలా, డేరా, తంబూర(తాన్ పురా), తబలా, తమాషా,తర్జుమా, తర్జుబా, తాఖీదు, తాజా,తాబేదారు, తారీఖు, తుఫాను(తూఫాన్), తైనాతీ, దగా, దగుల్బాజీ, దఫా, దర్జా, దర్జీ, ధగిడి(ఉంపుడు కత్తె), ధరావత్తు, నకిలీ, నజరానా, నమూనా, నవాబు, నవారు, నాడా(నూలు తాడు), నిఖార్సు, పంజా, పటకా, పక్కా, పట్టా, పనీర్, పరగణా,పరదా, పరారీ, పరార్, పహారా,పసందు,పీరు,పుల్కా,ఫకీరు,ఫర్మానా,ఫలానా,బంగళా, బందిఖానా, బందీ, బఖ్ షీస్, (అగరు)బత్తీ, బదిలీ, బరమా, బర్తరఫ్, బలాదూర్, బస్తా,బాకీ, బాజా, బాతాఖానీ, బాలీస్, బావుటా, బీడా,బూందీ, బేజారు, బేసరి, బేరీజు, బేల్దారి, భర్తీ, భరోసా, భేషుగ్గా, భోళా, మంజూరు, మండువా, మఖ్ మల్, మజా, మజిలీ, మతలబు, మరమ్మత్తు, మహల్,మాజీ, మామూలు, మాలిష్, మిఠాయి, మిరాసీ, మిస్వాక్(పల్లు పుల్ల), ముఠా, ముస్తాబు, మేజా, మేజోడు, మైదా, మైదానం, మోలీ, రద్దీ, రబీ(శీతాకాలంలో కోతకు వచ్చే పంట), రవాణా, రసీదు, రాజీ, రాజీనామా,రివాజు, రుసుం,రోజు, లంగరు, లగాయత్తు, లంగోటీ, లుంగీ,వకీలు, వసూలు, శరం, శివారు, షరతు, షరాయి, షామియానా, షాహుకారు, షికాయత్తు, సరిహద్దు(సర్ హద్), సర్కస్, సర్పంచ్, సన్నాయి, సవాలు, సామాను, సాదా,సెభాషు, సేమ్యా, స్వారీ, హంగామా, హమేషా, హల్వా, హవాలా, హాజరు(హాజిర్), హామీ, హుకుం. మొదలైనవి స్వల్పంగా మార్పులు పొంది ఆంధ్రుల వ్యవహారంలో ఉన్న ఉర్దూ పదాలు. వీటిలో కొన్ని పదాలు తెలంగాణ లో కూడ వాడుకలో ఉన్నాయి.



గురజాడ,తిరుపతి వేంకట కవులు మొదలైన వారు ప్రయోగించిన ఉర్దూ పదాలను గూర్చి మరో సారి..
Source: Shivaramakrishna Penna

Post a Comment

0 Comments