ఉచ్ఛారణ విషయంలో సూచనలు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం *వేఙ్కట, చఞ్చల,* *పణ్డిత, సన్తాన, సమ్పద* వంటి పదాలను ఈ రకంగా రాయడమే సముచితం. కానీ

*ఉచ్ఛారణ విషయంలో సూచనలు*

వ్యాకరణ శాస్త్రం ప్రకారం *వేఙ్కట, చఞ్చల,* *పణ్డిత, సన్తాన, సమ్పద* వంటి పదాలను ఈ రకంగా రాయడమే సముచితం. కానీ ఈ రోజుల్లో విద్యార్థులకు వీటిని చదవడమే చేతకావడం లేదు. కనుక మేము ఈ గ్రంథంలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు  *వేంకట, చంచల, పండిత, సంతాన* *సంపద* వంటి  రూపాలనే ముద్రించాము.

Published from Blogger Prime Android App


ఈ పద్ధతి వ్యాకరణానికి విరుద్ధమైనా సరే విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా చేయవలసి వచ్చింది.

అయితే ఇలాంటి సందర్భాల్లో *సున్నాను "N" గా పలికారా? "M" అని ఈనాటి విద్యార్థులు అడుగుతున్నారు. అలాంటి వారికోసం కొన్ని సూచనలను అందించవలసి వచ్చింది.

1   సున్నాకు స్వతంత్రంగా ఉచ్చారణ శక్తి లేదు. దానికి కుడి పక్క ఉండే హల్లుని బట్టి దాని ఉచ్చారణ మారుతూ ఉంటుంది. సున్నాకు కుడిపక్కన అచ్చులు రావు. 

2   సున్నాకు కుడి పక్కన కవర్గ అక్షరాలు (క, ఖ,గ, ఘ, ఙ) వస్తే, ఆ సున్నాను *ఙ్* గా పలకాలి.

*ఉదా:*  *సంఘటన = సఙ్ఘటన*

3   సున్నాకు కుడిపక్కన చవర్గ అక్షరాలు  (చ, ఛ, జ, ఝ, ఞ)  వస్తే దాన్ని *ఙ్* గా పలకాలి.

*ఉదా:*  *సంజయ = సఙ్ జయ.

4   సున్నాకు కుడిపక్కన టవర్గ అక్షరాలు వస్తే (ట, ఠ, డ, ఢ, ణ) వస్తే దాన్ని *ణ్* గా పలకాలి.

*ఉదా:*  *పాండవ = పాణ్ డవ*

5    సున్నాకు కుడిపక్కన తవర్గ అక్షరాలు  (త, థ, ద, ధ, న) వస్తే దాన్ని *న్* గా పలకాలి.

*ఉదా:*  *సంధాన = సన్ ధాన*

6   సున్నాకు కుడిపక్కన పవర్గ అక్షరాలు వస్తే (ప, ఫ, బ, భ, మ)  వస్తే  దాన్ని *మ్* గా పలకాలి.

*ఉదా:*  *సంభావితస్య = సమ్భావితస్య*

7   సున్నాకు కుడిపక్కన వత్తు అక్షరాలు వస్తే వాటిలో మొదటి అక్షరం  ఏ వర్గకు సంబంధించిందో,   
ఆ వర్గ పంచమాక్షరాన్ని ఉచ్చరించాలి.

ఉదా:  *సంక్షోభ = సఙ్ క్షోభ*

8   సున్నాకు కుడిపక్కన వర్గపంచమాక్షరాలు వస్తే
గూడా  పై నియమాలే వర్తిస్తాయి.

ఉదా:  *సంన్యాస = సన్యాస* 

 *సంమార్జన = సమ్మార్జన*
సున్నాకు కుడి పక్కన *ఙ, ఞ, ణ* అనే అక్షరాలు సాధారణంగా రావు.

9  సున్నాకు కుడిపక్కన *య* నుండి *హ* వరకు గల అక్షరాలు వస్తే, దాన్ని *మ్* గానే పలకాలి. కానీ ఇక్కడ ఉన్న ఉచ్చారణ విధానాన్ని గురుముఖంగా నేర్చుకోవలసిందే.

ఉదా: *సంయత* (వ్రాత) = సమ్ యత (ముక్కుతో ఉచ్చారణ) *సంహార* = సమ్ హార (ముక్కుతో ఉచ్చారణ)



10  ఇక  'హ' కారం క్రింద "ణ, న, మ" వచ్చినప్పుడు
ఉచ్ఛారణ విషయంలో కొన్ని జాగ్రత్తలు వ్యాకరణ పరంగా తీసుకోవాలి.

ఉదా: *ప్రాహ్ణ* (వ్రాత) = *ప్రాణ్ హ* ఉచ్చారణ

*వహ్ని* (వ్రాత) = *వన్ హి* ఉచ్చారణ
       
*బ్రహ్మ* (వ్రాత) = *బ్రమ్ హ* 
('హ'కారంతో *ఙ, ఞ* లు కలిసిన పదాలు లేవు)

11   'ఫ'కారాన్ని 'F' లాగా పలుకరాదు. 

*ఙ, ఞ, జ్ఞాన* - వంటి వాటి ఉచ్చారణలను సంప్రదాయం తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.



12   వత్తు అక్షరాలను (సంయుక్తాక్షరాలను) 
వ్రాసేటప్పుడు  దేన్ని ముందు వుచ్చరించాలో దాన్ని ముందు రాస్తారు.  దాన్ని సగమే పలకాలి.

ఉదా:  *పద్మ* (వ్రాత) = పద్ మ (ఉచ్చారణ)

*నిస్త్రైగుణ్య* (వ్రాత) = నిస్ + త్ + రైగుణ్య (ఉచ్చారణ).

Post a Comment

2 Comments

  1. అయ్యా, చాల చక్కగ వివరించినారు.
    వెంకట, పంచాంగము.. లాంటి పదాలను చూసి(చి)నప్పుడు అనుమానాలు వస్తూంటాయి.
    ఈ తరం వారు ఆంధ్ర, తెలంగాణ అంటూ తెలుగును మరీ దారుణంగ వక్రీకరిస్తున్నారు. ఉత్తరాది తెలుగు వారు మరీనూ.. సినినావారు వస్తది, పోతది, లాటి పదాలను తెచ్చినారు. మీలాంటివారు తెలుగు గురించి ప్రభుత్వాలతో మాట్లాడి సరిచేయండని విన్నవించుకుంటున్నాను.

    ReplyDelete