*ఽ* ఈ గుర్తు గురించి ఈ రోజు తెలుసుకొందాం! *ఽ* ఈ గుర్తును అవగ్రాహ అంటారు. దీనినే అకార ప్రశ్లేష అంటారు. ఇది సంస్కృత భాషలో వస్తుంది. మౌఖిక వ్యాకరణంలో దీనికి స్థానం లేదు. సంధి కార్యంలో 'అ' లోపించినప్పుడు

*ఽ* ఈ గుర్తు గురించి ఈ రోజు తెలుసుకొందాం!


*ఽ* ఈ గుర్తును అవగ్రాహ అంటారు. దీనినే అకార ప్రశ్లేష అంటారు. ఇది సంస్కృత భాషలో వస్తుంది.
మౌఖిక వ్యాకరణంలో దీనికి స్థానం లేదు. సంధి కార్యంలో 'అ' లోపించినప్పుడు అకార లోపాన్ని సూచించేందుకు వ్రాతలో ఈ గుర్తును వాడుతారు. ఉదాహరణకు
గృహే + అస్మి = గృహేఽస్మి

బాలః + అయమ్ = బాలోఽయమ్

కొన్నిసార్లు ఆ లోపానికి ఽఽ గుర్తు వాడడం కద్దు. 

సీతా + ఆగచ్ఛతి = సీతాఽఽగచ్ఛతి

ఈ గుర్తు వ్రాతలోని వాడుకకు సంబంధించినదే కాని వ్యాకరణానికి సంబంధించినది కాదు.

 సంస్కృత భాషలో ఉంటుంది.

*పైడినాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments