*ముత్తయిదువ/ముత్తైదువ* ఈ శబ్దాలను వాటి అర్థాలు పరిశీలిస్తాం. ఐదో తనం నాల్గో తనం మూడో తనం అనేవేమీ లేవు *అవిధవ* (అ+విధవ) విధవ కానిది- పుణ్యస్త్రీ - భర్తను కలిగి ఉన్న ) అనే మాటే ప్రాకృతం ద్వారా తెలుగులోకి ప్రవేశించి *అయిదువ* గా వ్యవహారంలో మారింది. అవిధవ శబ్దభవమే అయిదువ/ఐదువ/ఐదవ

*ముత్తయిదువ/ముత్తైదువ*
ఈ శబ్దాలను వాటి అర్థాలు పరిశీలిస్తాం.

ఐదో తనం నాల్గో తనం మూడో తనం అనేవేమీ లేవు  *అవిధవ* (అ+విధవ) విధవ కానిది- పుణ్యస్త్రీ - భర్తను కలిగి ఉన్న ) అనే మాటే ప్రాకృతం ద్వారా తెలుగులోకి ప్రవేశించి  *అయిదువ* గా వ్యవహారంలో మారింది. 
అవిధవ శబ్దభవమే అయిదువ/ఐదువ/ఐదవ

సంస్కృతంలో *అవిధవ* శబ్దం మనకు కాళిదాసు కావ్యాల్లో కూడా కనిపిస్తుంది.
భర్తృర్మిత్రం ప్రియ *మవిధవే* విద్ధి మామంబువాహమ్' (కాళిదాస మేఘ సందేశం లేదా మేఘదూతం 2.38) అంటూ ఇలా యక్షుని భార్యను మేఘుడు "అవిధవే" అని సంబోధిస్తాడు.



ఇక

*ముత్త-* అన్నది ద్రావిడ భాషల్లో ముదుసలి, వృద్ధ అన్న అర్థంలో వాడుతారు. ఇది తెలుగు, తమిళ, కన్నడాది అన్ని భాషల్లో కనిపిస్తుంది.

*ముత్ + అవిధవ = వృద్ధురాలైన పుణ్యస్త్రీ*

*ముత్ + అవిధవ > ముత్ + అయిదవ > ముత్తయిదువ = వృద్ధురాలైన పునిస్త్రీ*

ఐదు అలంకరణలకు నోచుకొనే స్త్రీ ( పూలు, నల్లపూసలు,కాలిమట్టెలు,గాజులు,నొసట తిలకం) అని లోక వ్యవహారంలో ఉంది. కాని అది కాదు.
భర్తను కలిగి ఉన్న స్త్రీ అని అర్థం.  ముత్తైదువ అంటే ముదుసలి మహిళ అని అర్థం.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments