*ఏ సందర్భంలో న కారం ణ కారం మారుతుంది?* రషాభ్యామ్ నోణః సమాన పదే. అనే సూత్రం ప్రకారం సంస్కృతి భాషలో

*ఏ సందర్భంలో న కారం ణ కారం మారుతుంది?*





రషాభ్యామ్ నోణః సమాన పదే.

అనే సూత్రం ప్రకారం సంస్కృతి భాషలో

న > ణ కారం ఎప్పుడు మారుతుంది అంటే
ప్ర+అన = ప్రాణ - (సవర్ణదీర్ఘ సంధి.)

ప్ర లోని ప్ + ర్ + అ 
ర సంయోగం(కలయిక) వల్ల న కారం ణ కారంగా మారింది.

రామ+ అయనం = రామాయణం
ఉత్తర+అయనం = ఉత్తరాయణం

వ్యాకరణం పరంగా
న ణ ఎప్పుడు మారుతుందో 
పరిశీలించండి మరి కొన్ని ఉదాహరణలు

ప్ర, పరా, నిర్, పరి ఈ ఉపసర్గలు పరమైనప్పుడు మా,యా, హా, పా, వా ధాతువుల ప్రత్యయ  *న* కారమునకు *ణ* త్వము వచ్చును.

ప్ర+ యానము = ప్రయాణము
నిర్+ యానము= నిర్యాణము
నిర్+మానము= నిర్మాణము
నిర్+వానము=నిర్వాణము
నిర్+మిమానుడు=నిర్మిమానణుడు
ప్ర+పానకము=ప్రపాణకము
ప్ర+హీనము=ప్రహీణము
పరి+హీనము=పరిహణము

అలాగే

దా(దాణ్,దేఙ్,దో) ధా ధాతువులకు కృదంత రూపాలు పరమైనప్పుడు ప్ర ,కు పరమైన ని యొక్క న కారం ణ త్వం వచ్చును.
ప్ర ౼ ని౼ హితము=  ప్రణిహితము
ప్ర ౼ ని ౼ ధానము = ప్రణిధానము
ప్ర ౼ ని ౼ దానము = ప్రణిదానము.

ఇలా 
వ్యాకరణం పరంగా 
రామ+అయనం=రామాయణం. మారుతుంది.

మిగతా వాటిని మరోసారి పరిశీలిద్దాం.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments