"శ్రీకృష్ణుని పట్టపురాణులు అష్టమహిషలు"

"శ్రీకృష్ణుని పట్టపురాణులు  అష్టమహిషలు"  

1రుక్మిణీ దేవి
2సత్యభామ
3జాంబవతి
4మిత్రవింద
5భద్ర
6సుదంత
7కాళింది
8లక్షణ

1 రుక్మిణి  భీష్మకుని పుత్రిక. రుక్మిణి సందేశాన్ని అందుకొని స్వయంవరం సమయంలో ఎత్తుకొచ్చి  వివాహం చేసుకొన్నాడు.
2 సత్యభామ  సత్రాజిత్తు కూతురు. శ్యమంతకమణిని తెచ్చి నిర్దోషిత్వం రుజువు చేసుకొన్న పిమ్మట సత్రాజిత్తు కూతురు నిచ్చాడు. 
3 జాంబవతి  జాంబవంతుని పుత్రిక. 
శ్యమంతకమణికై వచ్చిన జాంబవంతునితో 28 రోజులు యుద్దంచేసి ఓడించి గ్రహించాడు.
4 మిత్రవింద  అవంతీ రాకుమారి. మేనత్త కూతురు. ఆమె కోరిక మేర స్వయంవరానికి వచ్చి ఇతర రాజులను ఓడించి చేపట్టాడు.
5 భద్ర  వసుదేవుని చెల్లెలు శ్రుతకీర్తి కూతురు.
6 సుదంత అను నాగ్నజిత్తి  నగ్నిజిత్తుని పుత్రిక. స్వయంవరంలో ఏడుఎద్దులను బంధించి చేపట్టాడు.
7 కాళింది  సూర్య పుత్రిక. యమునా సైకతస్థలినుంచి తీసుకొచ్చి వివాహ మాడాడు 
8 లక్షణ  మద్రదేశ రాకుమారి, స్వయంవరంలో మత్స్య యంత్రం బేధించి చేపట్టారు.
.

Post a Comment

0 Comments