అర చేతిలో సిరి అంటే ఏమిటి? అరచేతిలో సిరి అనగా పూర్వం ప్రభుత్వ పాఠశాలలు విరివిగా లేనప్పుడు బాగా చదువుకున్న వ్యక్తులను తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి తమ ఊరికి తీసుకొచ్చి వారికి వేతనాలు ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించుకునేవారు.

అర చేతిలో సిరి అంటే ఏమిటి?



అరచేతిలో సిరి అనగా పూర్వం ప్రభుత్వ పాఠశాలలు విరివిగా లేనప్పుడు బాగా చదువుకున్న వ్యక్తులను తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి తమ ఊరికి తీసుకొచ్చి వారికి వేతనాలు ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించుకునేవారు. ఆ సమయంలో ఆ గురువు విద్యార్థులను శ్రద్ధగాను త్వరగా తన దగ్గరికి పిలుచుకునేందుకు వారికి భయభక్తులు పెట్టేవారు. అందులో ఒక భాగం వేకువ జామునే తన దగ్గరికి మొదటిగా వచ్చిన వాడిని సిరి అని  అరచేతిలో బెత్తంతో రాసేవాడు. రెండో వ్యక్తిగా వచ్చిన వాడిని చుక్క అనేవారు. మూడో వ్యక్తిగా వచ్చిన వారిని ఒక దెబ్బ వేసే వారు. ఇలా ఎంత వెనుక గా వస్తారో అన్ని బెత్తం దెబ్బలు వారికి పడేవి. ఇంకా ఆలస్యంకగా వస్తే గోడ కుర్చీలు, గుంజీలు ఇలా ఇది పూర్వం అంటే 25 లేదా 30 సంవత్సరాల క్రితం ఉండేది. ఇది నా అనుభవం లోనిది. మాకు విద్యాబుద్ధులు నేర్పిన భట్రాజు అయ్యవారు ఇలాగే  పిల్లలను త్వరగా రమ్మని చెబుతూ మొదటిగా వచ్చిన వారిని సిరి అని, రెండో వచ్చిన వారిని చుక్క,మూడవ వానికి బెత్తంతో ఒక దెబ్బ ఇలా చేసేవాడు. ఇది ఆనాటి విద్యా బోధన. ఇదీ గురుశిష్యులు అనుబంధం. అర చేతిలో సిరి అనగానే అలనాటి దృశ్యాలు నా కళ్ళముందు సాక్షాత్కరించాయి. ‌

అంతే కాదు అందులో నిగూఢంగా దాగిన ఒక ఆచార సంప్రదాయం కూడా ఉంది.
ఏ పని మొదలు పెట్టిన మొదట శ్రీ కారం తో వ్రాసి ప్రారంభిస్తారు. ఆది ఆచారం - సంప్రదాయం.
ఆ మొదలెట్టిన పని సవ్యంగా ఆటంకం లేకుండా అవిఘ్నంగా పూర్తికావాలని కోరుకోవడం.

ధన్యవాదాలు.
పైడి నాగ సుబ్బయ్య.

Post a Comment

0 Comments