౯ ఈ గుర్తు గురించి తెలుసుకొందాం ఈ రోజు *వలపల గిలక (౯)* నన్నయ కు పూర్వం పదానికి ఉత్తర భాగంలో వలపలగిలక చోటు చేసుకుంది. నేడు వలపల గిలక ఉన్నచోట్ల పూర్వాక్షరానికి దిత్వం వస్తుంది. పూర్వం దీన్ని రేఫకు బదులు గా వాడేవారు. దీని గుర్తు ౯

౯  ఈ గుర్తు గురించి తెలుసుకొందాం ఈ రోజు
*వలపల గిలక (౯)*
నన్నయ కు పూర్వం పదానికి ఉత్తర భాగంలో వలపలగిలక చోటు చేసుకుంది. నేడు వలపల గిలక ఉన్నచోట్ల పూర్వాక్షరానికి దిత్వం వస్తుంది.
పూర్వం దీన్ని రేఫకు బదులు గా వాడేవారు. దీని గుర్తు ౯
ఉదాహరణకు: కాత్తి ౯ కేయుణ్డు - కార్తికేయుండు.



వలపట అంటే కుడివైపు అని , దాపట అంటే ఎడమవైపు అని రైతులు పిలిస్తుంటారు.
ఈ ఎద్దు దాపట పోతుందా? వలపట పోతుందా? అని అడిగి ఎద్దులను బేరమాడుతారు.
వలపల(ట) వ్రాసేటప్పుడు కుడివైపు న వ్రాసే ౯ కారమని భావం.

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments